PM Modi: అప్పుడు కూడా అవిశ్వాస తీర్మానం పెట్టండి.. 2018లోనే ప్రతిపక్షాలకు సవాల్ చేసిన ప్రధాని మోడీ..No-confidence motion: మణిపూర్ హింసపై కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా పార్లమెంటులో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని INDIA కూటమి నేతలు నిర్ణయించారు. ఎంత పట్టు పడుతున్నా ప్రధాని సమాధానం ఇచ్చే అవకాశం లేకపోవడంతో విపక్షాలు కీలక నిర్ణయానికి వచ్చాయి.
No-confidence motion: మణిపూర్ హింసపై కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా పార్లమెంటులో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని INDIA కూటమి నేతలు నిర్ణయించారు. ఎంత పట్టు పడుతున్నా ప్రధాని సమాధానం ఇచ్చే అవకాశం లేకపోవడంతో విపక్షాలు కీలక నిర్ణయానికి వచ్చాయి. మణిపూర్‌పై మోదీ నోరు విప్పాలంటే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడమే మార్గమని డిసైడయ్యాయి. తీర్మానానికి జవాబిచ్చే సమయంలోనైనా ప్రధాని మణిపూర్‌పై మాట్లాడతారని ప్రతిపక్షాల వ్యూహంగా కనిపిస్తోంది. అవిశ్వాసం పెట్టేందుకు అవసరమైన 50 మంది సభ్యుల సంతకాలతో తీర్మానం డ్రాఫ్ట్ సిద్ధమైంది. అయితే, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా మణిపూర్ హింస సహ అనేక కీలక అంశాలపై చర్చించే అవకాశం లభిస్తుందని విపక్ష కూటమి భావిస్తోంది. కానీ.. మణిపూర్ హింసపై చర్చకు సిద్ధమని చెప్తున్న ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లులు ప్రవేశపెట్టి చర్చిస్తోంది. ఈ క్రమంలో మణిపూర్‌పై చర్చకు తాము ఏ మాత్రం భయపడటం లేదని బీజేపీ అగ్రనేతలు ఇప్పటికే ప్రకటించారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం వల్ల ఎలాంటి మార్పు ఉండదని.. 2018-19 ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చాయని.. అయితే, 2019 ఎన్నికల్లో బీజేపీ సీట్లు 282 నుంచి 300కి పెరిగాయని, మళ్లీ వారే తీసుకురావాలనుకుంటున్నారని.. ఈసారి 350కి పైగా సీట్లు వస్తాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు.అయితే, ఈ బిగ్ డిసెషన్ కు ముందు.. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఐదేళ్ల క్రితం 2018లో పార్లమెంట్ లో అవిశ్వాసం సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు.. 2018 వర్షాకాల సమావేశంలో ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. 12 గంటల పాటు సుధీర్ఘంగా సాగిన చర్చ తర్వాత నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని 199 ఓట్ల తేడాతో నెగ్గింది. 126 మంది సభ్యులు తీర్మానానికి మద్దతు ఇవ్వగా, 325 మంది ఎంపీలు తిరస్కరించారు. అయితే, 2023లో ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతాయని ప్రధాని మోడీ అప్పుడే జోస్యం చెప్పారు. 2024 ఎన్నికలకు ముందు 2023లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టండి.. అంటూ ప్రతిపక్షాలకు సవాలు చేశారు. 2024 ఎన్నికలకు ముందు మరోసారి అవిశ్వాస తీర్మానం తీసుకురావాలని కోరుతున్నా.. అప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది.. ఎవరు ఎక్కడుంటారో తెలుస్తుంది.. అంటూ ప్రసంగాన్ని ముగించారు ప్రధాని మోదీ. 2024లో అవిశ్వాస తీర్మానంతో మళ్లీ వస్తారు.. అంటూనే ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్రమోదీ ఫైర్ అయ్యారు. రాఫెల్ ఒప్పందంపై మోదీ ప్రభుత్వం అబద్ధాలు చెబుతూ దేశాన్ని ‘తప్పుదోవ పట్టిస్తున్నారని’ అంటూ రాహుల్ గాంధీపై ఫైర్ అయ్యారు. రాఫెల్ ఒప్పందం పూర్తిగా పారదర్శకంగా జరిగిందని ప్రధాని పేర్కొన్నారు. 2024లో కూడా అవిశ్వాస తీర్మానంతో మళ్లీ వస్తారు.. అప్పుడు కూడా మీ ఆటలు కొనసాగవంటూ ఎద్దెవా చేశారు. దేశంలోని ఓటర్లు మాత్రమే భవితవ్యాన్ని నిర్ణయించగలరు.. ఎందుకు తొందరపాటు? అంటూ ప్రధాని అప్పట్లోనే పేర్కొన్నారు. ప్రస్తుతం పీఎం మోడీ మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.లోక్‌సభలో మొత్తం సభ్యులు – 545.. ప్రస్తుతం లోక్‌సభలో ఎన్డీయే కూటమికి 332 మంది సభ్యుల మద్దతుంది. ఇండియా కూటమికి 140 మంది సభ్యులున్నారు. మరో 60 మందికిపైగా ఏ కూటమిలోనూ లేరు. ఖాళీగా 6 స్థానాలు ఉన్నాయి. అయితే, అవిశ్వాస తీర్మానానికి అనుమతి ఇవ్వాలా? వద్దా? అనే విషయాన్ని నిర్ణయించే అధికారం స్పీకర్‌కు మాత్రమే ఉంటుంది. స్పీకర్ అనుమతినిస్తే, పది రోజుల్లోగా.. నిర్ణయించిన తేదీల్లో చర్చ జరిగిన తర్వతా ఓటింగ్ జరుగుతుంది.