Hyderabad: హైదరాబాద్లో నాలుగు రాష్ట్రాల డీజీపీల సమావేశం.. కీలకమైన అంశంపై.. పటిష్ట చర్యల దిశగా..
హైదరాబాద్ కేంద్రంగా జరిగిన ఈ నాలుగు రాష్ట్రాల డీజీపీల సమావేశంలో సిఆర్పిఎఫ్ ఉన్నతాధికారుల సైతం పాల్గొన్నారు… మహారాష్ట్ర చత్తీస్గడ్ ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో ఇంకా తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో ఉన్నహైదరాబాద్, జులై26: హైదరాబాదులో నాలుగు రాష్ట్రాల డీజీపీల సమావేశం జరిగింది.. తెలంగాణ డిజిపి అంజనీ కుమార్ అధ్యక్షతన మహారాష్ట్ర, చతిస్గడ్ ,ఆంధ్రప్రదేశ్ ,రాష్ట్రాల డీజీపీల సమావేశం జరిగింది. సౌత్ డిజిపిల సమావేశం పేరిట జరిగిన ఈ సమావేశంలో మావోయిస్టుల వ్యవహారం పైన అత్యంత కీలక చర్చ జరిగింది…“తెలంగాణ లో ఇంకా మావోయిస్ట్ ల మూలాలు”
తెలంగాణలో మావోయిస్టుల అలజడి పూర్తిగా గా తుడిచి పెట్టక పోయిందని ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ నిత్యం బార్డర్ జిల్లాల్లో ఇంకా పోలీసుల బూట్ల చప్పుళ్ళు కూంబింగ్ రూపంలో ఇంకా వినిపిస్తుంటాయి… తెలంగాణ బార్డర్ జిల్లాల్లో ఇతర రాష్ట్రాల పోలీసుల సహకారాన్ని కోరుతూ గతంలో అనేక సమావేశాలు జరిగాయి కానీ ఈసారి హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ డిజిపి కార్యాలయంలో నాలుగు రాష్ట్రాల డీజీపీల సమావేశం జరిగింది. దీంట్లో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం మీద పైన అత్యంత కీలకమైన చర్చ జరిగింది …మావోయిస్టుల ప్రభావాన్ని ఏ రకంగా ఎదుర్కోవాలి ట్రైనింగ్ తో పాటుగా కలిసి ఏ రకంగా పనిచేయాలన్న అంశాల పైన పూర్తి స్థాయిలో చర్చ జరిగింది … కోఆర్డినేషన్ ట్రైనింగ్ తో పాటు మావోయిస్టులకు సంబంధించిన సమాచారాన్ని ఏ రకంగా షేర్ చేసుకోవాలన్న చర్చ కూడా జరిగింది ..గతంలో మావోయిస్టు ప్రభావిత అనేక రాష్ట్రాల్లో ఇలాంటి మీటింగ్లు జరిగాయి .
హైదరాబాద్ కేంద్రంగా జరిగిన ఈ నాలుగు రాష్ట్రాల డీజీపీల సమావేశంలో సిఆర్పిఎఫ్ ఉన్నతాధికారుల సైతం పాల్గొన్నారు… మహారాష్ట్ర చత్తీస్గడ్ ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో ఇంకా తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో ఉన్న మావోయిస్టుల ప్రభావాలను పూర్తిస్థాయిలో ఎదుర్కోవాలన్న చర్చ మాత్రం జరిగింది.