Kakinada: రాబిస్ లక్షణాలతో ఇద్దరు మృతి.. కుక్కల స్వైరవిహారంతో భయాందోళనలో స్థానికులు.. కన్నెత్తి చూడని అధికారులు..Kakinada District: ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టాలంటే వీధి కుక్కలకు భయపడే రోజులు వచ్చాయి. ఎక్కడ కుక్కలు వెంటపడి పిక్కలు పికుతాయాని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మొన్నటి వరకు ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఎండవేడికి ఒక్క పూతలతో..కాకినాడ జిల్లా న్యూస్, జూలై 25: ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టాలంటే వీధి కుక్కలకు భయపడే రోజులు వచ్చాయి. ఎక్కడ కుక్కలు వెంటపడి పిక్కలు పికుతాయాని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మొన్నటి వరకు ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఎండవేడికి ఒక్క పూతలతో పలు ఇబ్బందులు పడడం అందరికీ తెలిసిందే. అదే ఎండవేడికి కుక్కలు కూడా పిచ్చికుక్కల మారి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రాంతాలలో స్వైరవిహారం చేసి విచక్షణారహితంగా కరవటం వంటి కేసులు పలు ప్రాంతాలలో నమోదయ్యాయి. సకాలంలో వైద్యం అందించి వ్యాక్సిన్ లు వేయించి పలు జాగ్రత్తలు తీసుకున్న కొందరికి మాత్రం వ్యాక్సిన్లు వికటించి కొందరు, నిర్లక్ష్యానికి మరికొందరు కుక్క కాటుకి గురై ర్యాబిస్ లక్షణాలు సోకి మృత్యువాత పడుతున్నారు.ఇటువంటి సంఘటన కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో రెండు సంఘటన చోటుచేసుకున్నాయి. కుక్క కాటుకు గురై ఆరు నెలలు నిర్లక్ష్యం చేయడం తో ర్యాబిస్ బారినపడి ఒక యువకుడు మృతి చెందగా, 3నెలలు క్రితం కుక్క కాటుకు గురై యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ తీసుకున్నా మరో వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందడం స్థానికంగా అందరిని కలవరానికి గురిచేస్తుంది. కుక్కు కాటు నిర్లక్ష్యానికి గొల్లప్రోలుకు చెందిన 18 ఏళ్ల ఓంసాయి అనే యువకుడు బలి కాగా, యు కొత్తపల్లి మండలం అమినా బాద్‌కు చెందిన 52 ఏళ్ల బాణయ్య అనే వ్యక్తిని మూడు నెలలు క్రితం కుక్క కరచిన వెంటనే యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ వేయించుకున్నా మృతి చెందడం స్థానికుల్లో గుబులు రేపుతోంది.. ఒకే కుక్క ఒకే రోజున 14 మందిని కరవగా బాణయ్య మృతి తో కొత్తపల్లి పిహెచ్సి వైద్యాధికారులు అప్రమత్తమై మిగిలిన 14 మంది బాధితులకు వైద్య పరీక్షలు చేసి అబ్జర్వేషన్లో ఉంచారు.
గొల్లప్రోలు ఈ.బి.సి కాలనీకి చెందిన తేలు ఓంసాయి అనే యువకుడిని 6 నెలలు క్రితం ఒక వీధిలో కుక్క కరిచింది.. చిన్న గాయమే కదా అని లైట్ గా తీసుకున్న సాయి లోకల్‌గా టి.టి ఇంజక్షన్ చేయించుకుని యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ చేయించుకోకుండా నిర్లక్ష్యంగా ఊరుకున్నాడు. .. ఇటీవల మూడురోజులు క్రితం తీవ్రమైన జ్వరం రావడం తో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యపరీక్షలు చేయించగా పరిస్థితి విషమించడం తో ఏమి జరిగింది అని వైద్యులు సాయి తల్లిదండ్రులు ను ని అడిగితే సాధారణ జ్వరం అనే చెప్పారు… కానీ డాక్టర్స్ సాయిని అడిగితే మైండ్ బ్లాంక్ అయ్యింది.. ఆరు నెలలు క్రితం వీధిలో కుక్క కరిచిందని చెప్పాడు… అప్పటికే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు… సాయి నిర్లక్ష్యం తన ప్రాణాలమీదకు వస్తుందని తమ తెలియదని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.. కుక్క కరిచిన వెంటనే ఇంట్లో చెప్పినా యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ చేయించే వాళ్లమని , కుమారుడి దక్కించుకునేవాళ్ళమని సాయి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.మరో ప్రక్క యు.కొత్తపల్లి మండలం అమినా బాద్ లో గత ఏప్రిల్ 11తేదీన గ్రామానికి చెందిన గంటా భానయ్య (52) కుక్క కాటుకు గురయ్యాడు. కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుక్క కాటుకు సంబంధించి క్రమం తప్పకుండా యాంటీ ర్యాబిస్ టీకాలు వేయించుకున్నాడు. అయితే ఇటీవల అనారోగ్యం పాలై చిత్రమైన చేష్టలు చేయడంతో బంధువులు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. చికిత్స పొందుతూ బానయ్య మృతి చెందినట్లు పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు మంగళవారం తెలిపారు. కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి మౌనిక అదే రోజు కుక్కకాటు గురైన 14 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరిని అబ్జర్వేషన్ ఉంచుతున్నట్లు తెలిపారు. దీంతో వీరి కుటుంబ సభ్యులలో ఆందోళన మొదలైంది… ఈ రెండు ఘటనలతో స్థానికుల్లో కలవరం మొదలయ్యింది.. వీధుల్లో కుక్కలు చిన్న పెద్ద తేడా లేకుండా వెంబడించి దాడి చేస్తున్నాయని, వెంటనే అధికారులు స్పందించి కుక్కలను నిర్మూలించలని కోరుతున్నారు..
కాగా, కుక్క కాటుకు గురైన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా స్థానిక ఆరోగ్యకేంద్రాలకు వచ్చి యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ 4 డోసులు కోర్సును తప్పకుండా వేయించుకోవాలని నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడతాయని వైద్యులు చెబుతున్నారు.. కరచిన కుక్కలో ఏమైనా మార్పులు గమనిస్తే మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అత్యవసర వైద్యం చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.