Home Remedies: చేతులు, కాళ్లు కాంతివంతం కావాలంటే.. ఇంట్లోని వస్తువులతో ఇలా చేసి చూడండి..చాలామంది తమ ముఖం మీద పెట్టే శ్రద్ధ చేతులు, కాళ్ల విషయంలో పెట్టరు. స్కిన్ కేర్ గురించి తగిన జాగ్రత్తలు తీసుకోరు. దీంతో చాలామంది చేతులు, కాళ్లు నల్లగా మారుతూ ఉంటాయి. ఒకొక్కసారి అది ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. చేతులు, కాళ్ల దగ్గర ఉన్న నలుపు తగ్గి చర్మం కాంతివంతం కావాలంటే..కొన్ని చిట్కాలున్నాయి. ఇంట్లోని హోం రెమెడీతో పాదాలను కాంతివంతం చేసుకోవచ్చు. ఇలా చేయడం వలన డబ్బు ఆదా అవుతుంది. చర్మం చాలా బాగుంటుందిముఖ్యంగా రోజూ ఇంటి నుంచి బయటకు వెళ్లేవారికి ఈ సమస్య అధికంగా ఉంటుంది. వేడి, చెమట, ఎండలతో చేతులు, కాళ్లకు టాన్ ఏర్పడుతుంది. కనుక బయటి నుండి ఇంటికి వచ్చిన తర్వాత ప్రతిరోజూ మీ చేతులు, కాళ్ళను శుభ్రంగా కడుక్కోండి. అనంతరం ఈ చిట్కాను అనుసరించండి. ఇలా చేయడం డార్క్ స్పాట్లను సులభంగా తొలగిస్తుంది. పాదాలు చాలా శుభ్రంగా కనిపిస్తాయి.ఒక పెద్ద టబ్ తీసుకుని అందులో రెండు పెద్ద కప్పుల వేడి నీటిని వేయాలి. అందులో ఒక చెంచా బేకింగ్ సోడా, సగం నిమ్మరసం వేయండి. నిమ్మ తొక్కను కూడా వేడి నీటిలో వదిలిపెట్టండి. ఈ మిక్సింగ్ వాటర్ చేతులు, కాళ్ల నలుపుని తొలగిస్తుంది. పెద్ద టబ్ ను తీసుకుని వేడి నీరు వేసి ఒక పెద్ద చెంచా షాంపూ, ఉప్పుని వేసి బాగా కలపాలి. చేతులు, కాళ్లు ఆ నీటిలో ముంచాలి. నిమ్మ తొక్కతో గోళ్ల అంచులను బాగా రుద్దండి. నీటిలో మోచేతుల వరకు ముంచి నిమ్మతొక్కతో బాగా రుద్దాలి. చీలమండల పగుళ్లపై కూడా రుద్దండి. ఇలా చేయడంతో పాదాలు బాగా శుభ్రపడతాయి. ఇప్పుడు ఒక గిన్నెలో పంచదార, కొబ్బరి నూనెను బాగా మిక్స్ చేసి మీ చేతులు, కాళ్ళపై బాగా రుద్దండి. చక్కెర చర్మానికి మెరుపును తీసుకురావడానికి సహాయపడుతుంది. ఇది చాలా బాగా స్క్రబ్ చేస్తుంది. నిమిషం పాటు బాగా మసాజ్ చేసి, నీళ్లతో చేతులు కడుక్కోవాలి. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఇలా చేయడం వలన చేతులు, కాళ్ళు మృదువుగా ఉంటాయి. వారానికి ఒకసారి ఇలా చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి