Tollywood: బుర్కాలో కనిపించి షాక్ ఇచ్చిన హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి ముద్దుగుమ్మల లేటెస్ట్ పిక్స్ వరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ హీరోయిన్ ఫోటో కూడా వైరల్ గా మారింది. ఇంతకు పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
సోషల్ మీడియాలో హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోలు రోజుకు కొన్ని వందలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. తమ అభిమాన హీరోయిన్స్ ఫోటోలను అభిమానులు నిత్యం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి ముద్దుగుమ్మల లేటెస్ట్ పిక్స్ వరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ హీరోయిన్ ఫోటో కూడా వైరల్ గా మారింది. ఇంతకు పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? పై ఫొటోలో బుర్కా వేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..? ఆమె మనందరికీ బాగా తెలిసిన హీరోయినే.. పైగా ఈ అమ్మడు మన తెలుగు అమ్మాయే.. ఇంతకు ఆ అమ్మడు ఎవరో కాదు.పై ఫోటోలో బుర్కా వేసుకొని కనిపిస్తున్న హీరోయిన్ మరెవరో కాదు.. అమ్మడు కలర్ స్వాతి. ఇంతకూ స్వాతి బుర్కా ఎందుకు వేసుకుంది.?కలర్స్ స్వాతి ఒకప్పుడు హీరోయిన్ గా రాణించింది. ఆతర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇక ఇప్పుడు మళ్లీ వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తుంది.ఇక ఈ అమ్మడు భర్తతో విడిపోతుందని టాక్ వినిపిస్తుంది. భర్తతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియా నుంచి తొలగించింది స్వాతి. దాంతో వీరిద్దరూ విడిపోతున్నారని వార్తలు షికారు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే సడన్ గా కలర్స్ స్వాతి బుర్కా కనిపించి షాక్ ఇచ్చింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో బుర్కా వేసుకొని సందడి చేసింది. అభిమానులు గుర్తుపట్టకుండా ఉండేదుకే ఆమె ఇలా బుర్కా వేసుకుంది. ఆమె ఎక్కడికో ప్రయాణిస్తుంది. రైలు ఎక్కినా తర్వాత బుర్కా తీసేసింది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.