Bro: రేపే పవర్ స్టార్ బ్రో మూవీ ప్రీరిలీజ్.. టీవీ9లో లైవ్ చూసి ఎంజాయ్ చేయండిసముద్ర ఖని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా తమిళ్లో రిలీజ్ అయిన వినోదయ సిత్తం మూవీకి రీమేక్ గా వస్తుంది ఈ సినిమా. తమిళ్ లో ఘనవిజయం సాధించింది.మరో నాలుగు రోజుల్లో మెగా ఫ్యాన్స్ కు పండగ రానుంది. అదేంటనుకుంటున్నారా.. పవర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న బ్రో సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. సముద్ర ఖని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా తమిళ్లో రిలీజ్ అయిన వినోదయ సిత్తం మూవీకి రీమేక్ గా వస్తుంది ఈ సినిమా. తమిళ్ లో ఘనవిజయం సాధించింది. ఇక ఇప్పుడు ఈ మూవీని తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేర్పులు చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అలాగే ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను రేపు అంటే జులై 25 ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించనున్నారు.రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ పెంచేశారు. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఈ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కు భారీగా ఫ్యాన్స్ హాజరుకానున్నారు.పవన్ కళ్యాణ్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ అంటే సందడి మాములుగా ఉండదు. ఆడిటోరియం అదిరిపోవాల్సిందే.. రీ సౌండ్ తో దద్దరిల్లిపోవాల్సిందే.. ఇప్పటి వరకు జరిగిన ప్రీరిలీజ్ ఈ వెంట్స్ ఒక ఎత్తు ఇప్పుడు బ్రో ఈవెంట్ ఒక ఎత్తు. ఇద్దరు మెగా హీరోలు కలిసి ఒకే స్టేజ్ పై సందడి చేయనున్నారు. ఇక ఈ ఈవెంట్ డైరెక్ట్‌గా చూసే వారితో పాటు టీవీలలో చూసే వారు కూడా ఎక్కువే ఉంటారు. అలా ఈ సారి టీవీ 9 తెలుగు, టీవీ 9 ఎంటర్టైనెంట్ లో బ్రో మూవీ ప్రీరిలీజ్ ను వీక్షించి ఎంజాయ్ చేయండి. మామూలుగానే పవర్ స్టార్ మూవీ ఈవెంట్‌కు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తాయి.. ఈసారి అంతకు మించి వ్యూస్ రావడం ఖాయం.. ఫ్యాన్స్ రప్పిస్తారు కూడా.. కాబట్టి రేపు ( జులై 25) సాయంత్రం నుంచి బ్రో మూవీ ఈవెంట్‌ను టీవీ 9లో చూసి ఎంజాయ్ చేయండి.