Hyderabad: బాబోయ్.. హెల్ప్ చేయండి ప్లీజ్.. స్నేక్ రాజాలతో బెంబేలెత్తుతున్న హైదరాబాదీలు..అటు వర్షాలతోపాటు.. హైదరాబాద్ వాసులకు పాముల భయం వెంటాడుతుండటం ఆదోళన కలిగిస్తోంది. ఐదు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటం, జలశయాలకు వరదలు పొటెత్తడంతో ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ (FoSS) ఫోన్ల తాకిడి పెరిగింది.హైదరాబాద్ నగరంలోని జంట జలాశయాలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. నాలుగు రోజులుగా హైదరాబాద్‌వ్యాప్తంగా సిటీ శివారు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు నిండుకుండల్లా మారాయి. రెండు ప్రాజెక్టులు కూడా పూర్తిస్థాయి నీటి మట్టాలకు చేరుకున్నాయి. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌కు వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. దాంతో.. జలమండలి అధికారులు వరద నీటిని మూసీలోకి వదులుతున్నారు. అటు వర్షాలతోపాటు.. హైదరాబాద్ వాసులకు పాముల భయం వెంటాడుతుండటం ఆదోళన కలిగిస్తోంది.ఐదు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటం, జలశయాలకు వరదలు పొటెత్తడంతో ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ (FoSS) ఫోన్ల తాకిడి పెరిగింది. తమ నివాస ప్రాంతాల్లోకి పాములు వచ్చాయని.. వాటిని రెస్క్యూ చేయాలంటూ ప్రజలు ఫోన్ ల మీద ఫోన్లు చేస్తున్నారు. వరద నీటిలో కొట్టుకొస్తున్న ప్రమాదకరైన నాగుపాములు, ఇతర విషపూరితమైన పాములు అపార్ట్మెంట్లు, భవనాలు, వ్యాపార సముదాయాల్లోకి పాములు చేరుతున్నాయని FoSS ప్రధాన కార్యదర్శి అవినాష్ విశ్వనాథన్ పేర్కొన్నారు.గత కొద్ది రోజులుగా FoSS వాలంటీర్లు అనేక పాములను రక్షించి.. సురక్షిత ప్రాంతాల్లో వదిలిపెడుతున్నారని తెలిపారు. వర్షాల నాటినుంచి.. FoSS గత వారంలో రోజుకు దాదాపు 250 కాల్‌లను స్వీకరిస్తోందని.. వెంటనే అప్రమత్తమై పాములను రెస్క్యూ చేస్తున్నట్లు తెలిపారు. ఎక్కువగా పాములు హౌసింగ్ కాంపౌండ్స్లో కనిపిస్తున్నాయని తెలిపారు.జలాశయాలు, చెరువులు, సరస్సులు పొంగిపొర్లడం వల్ల.. ఎక్కువగా వరద నీటిలో పాములు బయటకు కొట్టువస్తున్నాయని.. ఇలా నివాస ప్రాంతాలకు చేరుతున్నాయని తెలిపారు. అయితే, నగరంలోని ఇళ్లలోకి ప్రవేశించడం చాలా అరుదని అవినాష్ చెప్పారు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా నాగు పాములను రక్షించినట్లు తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నగర శివార్లలోని పలు ఇళ్లు, కంపెనీలు, కర్మాగారాల్లో పాములు చేరినట్లు పేర్కొన్నారు.తమకు కాల్ వచ్చిన వెంటనే.. తాము స్థానిక వాలంటీర్లను స్పాట్‌కు వెళ్లమని ఆదేశిస్తామని తెలిపారు.. ప్రధానంగా బీరంగూడ, నిజాంపేట్, కూకట్పల్లి, షేక్‌పేట్, దామాయిగూడ, లింగంపల్లి, పటాన్చెరు, హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్, నాగోల్, అత్తాపూర్, రాయదుర్గం, రాంపల్లి ప్రాంతాల నుంచి కాల్స్ వస్తున్నాయన్నారు.సొసైటీలో సుమారు 150 మంది సుశిక్షితులైన వాలంటీర్లు ఉన్నారని.. వారంతా పాములను రక్షించి అటవీ ప్రాంతాలకు తరలిస్తారని అవినాష్ వివరించారు.