Mahaveerudu: ఓటీటీలోకి శివకార్తికేయన్ మహావీరుడు.. స్ట్రీమింగ్ అందులోనేనా..?తెలుగులో దళపతి విజయ్, సూర్య, విశాల్ , విజయ్ సేతుపతి లాంటి హీరోలకు మంచి మార్కెట్ ఉంది. అలాగే యంగ్ హీరో శివకార్తికేయన్ కు కూడా ఇక్కడ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని తేడా లేకుండా మంచి కంటెంట్ ఉంటే చాలు సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్నాయి. కేవలం తెలుగు సినిమాలే కాదు కోలీవుడ్ నుంచి డబ్ అయిన సినిమాలు కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. అలా ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో మహావీరుడు మూవీ ఒకటి. శివకార్తికేయన్ హీరోగా నటించిన ఈ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో దళపతి విజయ్, సూర్య, విశాల్ , విజయ్ సేతుపతి లాంటి హీరోలకు మంచి మార్కెట్ ఉంది. అలాగే యంగ్ హీరో శివకార్తికేయన్ కు కూడా ఇక్కడ మంచి ఫ్యాన్ బేస్ ఉంది.ఇక శివకార్తికేయన్ హీరోగా నటించిన మహావీరన్ సినిమా తెలుగులో మహావీరుడు అనే టైటిల్ తో రిలీజ్ అయ్యింది. రెమో, వరుణ్ డాక్టర్, డాన్, ప్రిన్స్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు శివకార్తికేయన్. మహావీరుడు సినిమాలో స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ హీరోయిన్ గా నటించింది.
మహావీరుడు సినిమాను జులై 14న విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీకి మాస్ రాజా రవితేజ డబ్బింగ్ చెప్పారు. సునీల్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఇక ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై ఆసక్తి నెలకొంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. భారీ ధరకు అమెజాన్ ఈ మూవీని కొనుగోలు చేసిందని తెలుస్తోంది. త్వరలోనే మహావీరుడు సినిమాను త్వరలోనే ఓటీటీలో రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. ఆగస్టు మొదటి వారంలో ఓటీటీలో రిలీజ్ చేయనున్నారని టాక్.