Bizarre: ఇదేం పైత్యం రా అయ్యా! యూట్యూబ్ వీడియో చూసి తలకు రంద్రం పెట్టుకున్నాడు.. ఎందుకో తెలిస్తే గుడ్లు తేలేస్తారు..!Viral News: యూట్యూబ్ చూసి అనేక అంశాలను నేర్చుకోవచ్చు. చాలా మంది తమ కెరీర్ కోసం అవసరమైన వాటిని నేర్చుకుంటారు. బిజినెస్ ఐడియాస్, స్టడీ, ఇతర అంశాల గురించి యూట్యూబ్ వీడియోలు చూడటం ద్వారా నేర్చుకుంటారు. ఇక కొందరు కంత్రీగాళ్లు హత్యలు ఎలా చేయాలి, బాంబులు ఎలా తయారు…Viral News, July 22: యూట్యూబ్ చూసి అనేక అంశాలను నేర్చుకోవచ్చు. చాలా మంది తమ కెరీర్ కోసం అవసరమైన వాటిని నేర్చుకుంటారు. బిజినెస్ ఐడియాస్, స్టడీ, ఇతర అంశాల గురించి యూట్యూబ్ వీడియోలు చూడటం ద్వారా నేర్చుకుంటారు. ఇక కొందరు కంత్రీగాళ్లు హత్యలు ఎలా చేయాలి, బాంబులు ఎలా తయారు చేయాలని నేర్చుకుంటారు. మరికొందరు వీడియోలో చూసుకుంటూ సొంతంగా వైద్యం చేస్తారు.. తమకు తాము చేసుకుంటారు. ఇలాంటి ఘటనలు బెడిసికొట్టి ప్రాణాల మీదికి తెచ్చుకున్నవారు చాలా మందే ఉన్నారు. ఇలాంటి ఘటనే తాజాగా మరొకటి వెలుగులోకి వచ్చింది. కలలు వస్తున్నాయని, వాటిని నియంత్రించుకునేందుకు ఎవరూ చేయని సాహసం చేశాడు. ఏకంగా తననలో ఓ చిప్ పెట్టుకునేందుకు ట్రై చేశాడు. ఆ ప్రయోగం అతన్ని చావు అంచుల వరకు తీసుకెళ్లింది.
యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. రష్యాకు చెందిన మిఖాయిల్ రాదుగా(40) కజకిస్థాన్‌లో సెటిల్ అయ్యాడు. అయితే, తనకు రోజూ నిద్రలో కలలు వచ్చేవట. వాటిని ఎలాగైనా నియంత్రించాలని ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలో యూట్యూబ్ వీడియోలు చూసి మెదడులో చిప్ పెట్టుకోవడం ద్వారా ఆ కలలను నియంత్రిచొచ్చని నిర్ణయానికి వచ్చాడు. ఇదే అంశంపై న్యూరో సర్జన్ల సహాయం కోరాడు. అయితే, అతని చెప్పిన పని చేస్తే జైల్లో ఊచలు లెక్కించాల్సి వస్తుందని గ్రహించిన వైద్యులు.. అందుకు నిరాకరించారు.
ఇక లాభం లేదనుకుని, తానే ఈ పనిని పూర్తి చేయాలనుకున్నాడు. యూట్యూబ్‌లో వీడియోలను చూసిన మిఖాయిల్.. ముందుగా ఒక డ్రిల్లింగ్ మిషన్ కొన్నాడు. దాని సహాయంతో తలకు రంద్రం చేసుకున్నాడు.. ఓవైపు రక్తం కారుతున్నప్పటికీ పట్టించుకోకుండా తలలో ఎలక్ట్రోడ్ చిప్‌ను అమర్చుకున్నాడు. దాదాపు 4 గంటల పాటు ఈ ప్రయోగం చేయగా.. తీవ్ర రక్తస్త్రావం అయ్యింది. దాంతో అతను ప్రాణాపాయంలో పడ్డాడు. అయితే, అతని అదృష్టం బాగుండి.. కొందరు అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో వైద్యులు చికిత్స అందించి అతన్ని బతికించారు.కాగా, మిఖాయిల్ తన ప్రయోగానికి సంబంధించిన వివరాలు, ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో విషయం కాస్తా వైరల్ అయ్యింది. ఇతని తిక్క పనికి నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. పిచ్చి ఏమైనా ఎక్కిందా? అంటూ విమర్శలు చేస్తున్నారు.