Kishan Reddy: ఆ సెంటిమెంట్ కొనసాగించిన కిషన్ రెడ్డి.. గతంలో బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ కూడా..Kishan Reddy: నాల్గోసారి తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి భాగ్యలక్ష్మి టెంపుల్ సెంటిమెంట్‌ని కొనసాగించారు. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నపుడు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని తన బాధ్యతల ప్రస్థానం మెదలు పెట్టారు. ఆయన ఆ బాధ్యతల్లో..Kishan Reddy: నాల్గోసారి తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి భాగ్యలక్ష్మి టెంపుల్ సెంటిమెంట్‌ని కొనసాగించారు. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నపుడు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని తన బాధ్యతల ప్రస్థానం మెదలు పెట్టారు. ఆయన ఆ బాధ్యతల్లో ఉన్నంత కాలం కూడా ముఖ్యమైన సందర్భాల్లో చార్మినార్ భాగ్య లక్ష్మి అమ్మవారిని దర్శించుకునేవారు. అలా ఆ ఆలయానికి తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడికి ప్రత్యేక అనుబంధం ఉండేది. ఇప్పుడు అదే సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసే ముందుగా అమ్మవారిని దర్శించుకొని తన పని మొదలు పెట్టారు.ఈ మేరకు భాగ్యలక్ష్మి దేవాలయంలో కిషన్ రెడ్డి పూజలు నిర్వహించారు. అనంతరం బీజేపీ కార్యకర్తలు అందించిన ఖడ్గం ఎత్తిన కిషన్ రెడ్డి అక్కడి నుంచి అంబర్ పేటలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి, లిబర్టీ అంబేద్కర్ విగ్రహానికి పూ మాల వేసి నివాళులు అర్పించారు. ఆ తరువాత బషీర్ బాగ్ కనకదుర్గ ఆలయంలో పూజలు చేసారు. అటు నుంచి గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్దకు చేరుకుని అమలవీరులకు నివాళులు అర్పించారు కిషన్ రెడ్డి. అనంతరం గన్ పార్క్ నుంచి తెలంగాణ బీజేపీ కార్యాలయానికి ర్యాలీగా తరలివెళ్లారు.కాగా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టడం ఇది నాలుగో సారి. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడిగా రెండు సార్లు బాధ్యతలు నిర్వర్తించిన ఆయన.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ తొలి అధ్యక్షుడిగా ఉన్నారు. తాజాగా నాలుగో సారి అధ్యక్ష పగ్గాలను అందుకున్నారు.