Andhra Pradesh: చంద్రబాబు హయాంలో 60 లక్షల నకిలీ ఓట్లు.. మంత్రి పెద్దిరెడ్డి సంచలన ఆరోపణలు..ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. వాలంటీర్లు కుప్పంలో ప్రజలకు సేవ చేస్తే.. నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు మాత్రం హైదరాబాద్లో దాక్కున్నారని దుయ్యబట్టారు. చిత్తూరు జిల్లా కుప్పంలో మంత్రి పెద్దిరెడ్డి నాలుగు రోజులుగా సుడిగాల పర్యటన చేస్తున్నారు. ఇప్పటికే కుప్పం మున్సిపాలిటీలో వార్డు బాట పూర్తి చేసిన పెద్దిరెడ్డి.. గుడుపల్లి, శాంతిపురం మండలాల్లో పల్లె బాట నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కుప్పం ప్రజలు జగన్ వెంటే ఉన్నారని అన్నారు.ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. వాలంటీర్లు కుప్పంలో ప్రజలకు సేవ చేస్తే.. నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు మాత్రం హైదరాబాద్లో దాక్కున్నారని దుయ్యబట్టారు. చిత్తూరు జిల్లా కుప్పంలో మంత్రి పెద్దిరెడ్డి నాలుగు రోజులుగా సుడిగాల పర్యటన చేస్తున్నారు. ఇప్పటికే కుప్పం మున్సిపాలిటీలో వార్డు బాట పూర్తి చేసిన పెద్దిరెడ్డి.. గుడుపల్లి, శాంతిపురం మండలాల్లో పల్లె బాట నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కుప్పం ప్రజలు జగన్ వెంటే ఉన్నారని అన్నారు. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో జగన్ లాంటి గొప్ప నాయకుడిని చూడలేదన్నారు. చంద్రబాబు అధికారంలో వచ్చాక ఇచ్చిన హామీలను మర్చిపోయే అలవాటు ఉందని ఎద్దేవా చేశారు. కానీ, ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేర్చడం జగన్కు మాత్రమే సాధ్యమన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి.. అధికారంలోకి రాగానే 2 లక్షల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారని ఆరోపించారు. ఇక జగన్ సీఎం అయ్యాక 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారని చెప్పుకొచ్చారు మంతరి పెద్దిరెడ్డి.చంద్రబాబు హయాంలో 60 లక్షల దొంగ ఓట్లు..
చంద్రబాబు సీఎం గా ఉన్న సమయంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున దొంగఓట్ల నమోదు జరిగిందని మంత్రి పెద్దిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. 2019లో 30 వేల మెజారిటీకి పరిమితమైన చంద్రబాబుకు రాబోయే ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీ ఎలా వస్తుందో చూస్తామన్నారు. 2019 ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి చంద్రమౌళి ఆసుపత్రిలో ఉన్నా 30వేల ఓట్ల తేడాతోనే ఓడిపోయారని పెద్దిరెడ్డి గుర్తు చేశారు. ఈసారి ఆయన కొడుకు ఎమ్మెల్సీ భరత్ కుప్పం నుంచి పోటీ చేస్తున్నారని, కుప్పంలో వైసీపీ విజయం ఖాయమన్నారు పెద్దిరెడ్డి. సర్వేలన్నీ తమకు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. 14 ఏళ్లుగా సీఎంగా ఉన్న చంద్రబాబు.. కుప్పంకు చేసిందేమీ లేదని విమర్శించారు మంత్రి పెద్దిరెడ్డి. గ్రామాల్లో పర్యటిస్తుంటే పెద్ద ఎత్తున జనం తమ సమస్యలు చెప్పుకుంటున్నారని, చంద్రబాబు చేస్తున్న మోసాన్ని కుప్పం ప్రజలు పసిగట్టారని వ్యాఖ్యానించారు.
కుప్పం ఎమ్మెల్యేగా భరత్, చిత్తూరు ఎంపీగా రెడ్డప్ప విజయం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి. కుప్పంలో దొంగ ఓట్లు చూసిన తర్వాత రాష్ట్రంలో దొంగ ఓట్లపై దృష్టి సారించామన్నారు మంత్రి. చంద్రబాబు అధికారంలో ఉండగా నమోదైన 60 లక్షల దొంగ ఓట్లపై ఎమ్మెల్యేలను, ఎంపీలను అప్రమత్తం చేశామని చెప్పారు. ఈ మేరకు దొంగ ఓట్లను గుర్తించే పనిలో ఉన్నామని, ఆధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు. 2019 ఎన్నికలకు ముందే ఈ తంతు జరిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దొంగ ఓట్లపై ఫిర్యాదు చేసామన్నారు. కుప్పంలో ఇప్పటి వరకు 17 వేల ఓట్లు గుర్తించామని, మరో 25 వేలకుపైగా దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పారు మంత్రి పెద్దిరెడ్డి.