జిమ్‌లో ట్రెడ్మిల్ చేస్తూ కరెంట్‌షాక్‌తో కుప్పకూలిన సాఫ్టవేర్.. యజమాని అరెస్ట్..తన కొడుకు గత మూడు-నాలుగు నెలలుగా జిమ్‌కి వెళుతున్నాడని, సమయం దొరికినప్పుడల్లా అక్కడికి వెళ్లేవాడని మహేష్ కుమార్ తెలిపారు. తన కొడకు మృతికి కారణమైన జిమ్ యజమానిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాడు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.జిమ్‌లో ట్రెడ్మిల్ చేస్తూ కరెంట్ షాక్ తగిలి ఓ యువకుడు మృతిచెందిన విషాద సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. జూలై 18న రోహిణిలోని సెక్టార్ 15లోని జిమ్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడు రోహిణి సెక్టార్ 19కి చెందిన సక్షమ్గా గుర్తించారు. ఈ విషయంపై కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు తెలిపారు. జిమ్ యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా తెలిపారు. ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అపస్మారక స్థితిలో పడివున్న 24 ఏళ్ల వ్యక్తిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే అతడు మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. జిమ్‌లో ట్రెడ్మిల్ ఉపయోగిస్తుండగా కరెంట్ షాక్ తగిలి మరణించినట్టుగా పోలీసుల విచారణలో తేలింది.మృతుడి తండ్రి మహేష్ కుమార్ మాట్లాడుతూ.. తన కొడుకు.. సక్షమ్ ఒక బహుళజాతి కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడని, రోజు వారి వ్యాయామం కోసం అతను జిమ్‌కు వెళ్లేవాడని చెప్పాడు. రోజులానే ఈ రోజు కూడా అతను జిమ్‌కు వెళ్లాడు. జిమ్‌లో ట్రెడ్మిల్ చేస్తుండగానే ఉన్నట్టుండి స్పృహతప్పి పడిపోయాడంటూ తమకు ఫోన్ వచ్చిందని చెప్పాడు. అప్పటికే తమ కొడుకు సక్షమ్ని ఆస్పత్రికి తరలించారని, అప్పటికే అతడు మరణించినట్టుగా వైద్యులు చెప్పారని అన్నాడు. అయితే, పోలీసులు దర్యాప్తులో జిమ్‌లోని సీసీ టీవీ పుటేజ్‌ని సేకరించారు. ట్రెడ్మిల్ యంత్రానికి ఎక్కువ కరెంట్ ఉండటం వల్ల అతను విద్యుదాఘాతానికి గురయ్యాడని CCTV కెమెరాలో స్పష్టం కనిపించిందని చెప్పాడు.తన కొడుకు గత మూడు-నాలుగు నెలలుగా జిమ్‌కి వెళుతున్నాడని, సమయం దొరికినప్పుడల్లా అక్కడికి వెళ్లేవాడని మహేష్ కుమార్ తెలిపారు. తన కొడకు మృతికి కారణమైన జిమ్ యజమానిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాడు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.