Basara: బాసర సరస్వతి ఆలయ హుండీలో లేఖ కలకలం.. అందులో ఏం రాసుందంటే..నిర్మల్ జిల్లా బాసర ఆలయ హుండీలో ఓ లేఖ కలకలం రేపింది. కానుకలు లెక్కిస్తుండగా కనిపించిన ఆ లేఖ హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకీ.. ఆ లెటర్లో ఏముంది?.. అసలెవరు రాశారు?.. ఇంట్రస్టింగ్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. సాధారణంగా ఏదైనా టెంపుల్‌కు వెళ్లినప్పుడు మొక్కులు తీర్చుకుని.. హుండీలో కానుకలు సమర్పిస్తుంటారు భక్తులు. కోరిన కోర్కెలు తీర్చాలని ఆయా దేవుళ్లకు మొక్కుకుంటారు.నిర్మల్ జిల్లా బాసర ఆలయ హుండీలో ఓ లేఖ కలకలం రేపింది. కానుకలు లెక్కిస్తుండగా కనిపించిన ఆ లేఖ హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకీ.. ఆ లెటర్లో ఏముంది?.. అసలెవరు రాశారు?.. ఇంట్రస్టింగ్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. సాధారణంగా ఏదైనా టెంపుల్‌కు వెళ్లినప్పుడు మొక్కులు తీర్చుకుని.. హుండీలో కానుకలు సమర్పిస్తుంటారు భక్తులు. కోరిన కోర్కెలు తీర్చాలని ఆయా దేవుళ్లకు మొక్కుకుంటారు. మరికొందరు.. కోర్కెలు నెరవేర్చాలని కట్టిన ముడుపులు చెల్లిస్తుంటారు. ఇంకొందరు.. చిట్టీలు రాసి హుండీల్లో వేస్తుంటారు. కానీ.. నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలోని హుండీలో ఏకంగా ఓ లేఖనే వేయడం చర్చనీయాంశంగా మారింది. బాసర ఆలయంలోని కానుకల లెక్కింపులో భాగంగా హుండీని తెరవగా అందులో వినతి పత్రం కనిపించింది.ఆ లేఖ ఆర్జీయూకేటీ బాసరలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు రాసినట్లు తెలుస్తోంది. ఈ లేఖలో.. బాసర ట్రిపుల్ ఐటీలోని పరిస్థితులను వివరించారు. శత కోటి దండాలతో తమరి పాదాలకు ప్రణమిల్లి వ్రాయునది ఏమనగా.. అంటూ లేఖను ప్రారంభించారు. అమ్మా.. మేము ఎందరికో మా బాధలు విన్నవించుకున్నాము.. కానీ.. మీకు ఏనాడు తెలుపలేదు. మీరు జ్ఞానం అందించే అమ్మగా.. తమ తప్పులను క్షమించి పిల్లల బాధలు తీర్చే విధంగా పాలకులు, అధికారులను మేలు కొలపాలని ప్రార్థించారు. రెండేళ్లుగా తాము పోరాటాలు చేస్తున్నామని.. ట్రిపుల్ ఐటీలో చదువుతున్న తమ పిల్లలు వారం రోజులు పోరాటం చేసినా.. అటు అధికారులు గానీ, ఇటు ప్రభుత్వం గానీ ఏమాత్రం కనికరించలేదని లేఖలో రాసుకొచ్చారు.
చదువుల కోసం చేసిన పోరాటానికి ఎలాంటి ఫలితం లేకుండా పోయిందమ్మా.. అధికారుల ఒత్తిళ్లకు లోనై కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పుకొచ్చారు. ఇకనైనా అధికారులకు జ్ఞానం ప్రసాదించి తమ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని లేఖలో వేడుకున్నారు. అయితే.. హుండీలో లభ్యమైన ఈ లేఖ వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. మరి.. ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల పేరెంట్స్ కమిటీ రాసిన లేఖపై అధికారులు, ప్రభుత్వ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.