Actress: ఈ ఫొటోలోని పాపను గుర్తుపట్టారా? ఒక్క సినిమాతోనే సెన్సేషన్.. కుర్రాళ్ల లేటెస్ట్ క్రష్ఈ ఫొటోలో పేరెంట్స్‌తో కలిసి క్యూట్‌గా పోజులిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా? ఇప్పుడు తనొక హీరోయిన్. కుర్రాళ్ల లేటెస్ట్ క్రష్. గతంలో స్పెషల్ రోల్స్‌తో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ ఇటీవలే తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా థియేటర్లలోకి విడుదలైన తన సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ ఏడాది మోస్ట్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్‌గా ప్రశంసలు అందుకుంది.ఈ ఫొటోలో పేరెంట్స్‌తో కలిసి క్యూట్‌గా పోజులిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా? ఇప్పుడు తనొక హీరోయిన్. కుర్రాళ్ల లేటెస్ట్ క్రష్. గతంలో స్పెషల్ రోల్స్‌తో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ ఇటీవలే తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా థియేటర్లలోకి విడుదలైన తన సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ ఏడాది మోస్ట్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్‌గా ప్రశంసలు అందుకుంది. ఇక మూవీలో అమ్మడి అందం, అభినయం అందరినీ ఆకట్టుకుంది. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు ఈ బ్యూటీపై ప్రశంసలు కురిపించారు. అలా హీరోయిన్గా ఎంట్రీతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కుర్రాళ్ల లేటెస్ట్ క్రష్‌గా మారిపోయింది. మరి ఆమె ఎవరో కనిపెట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా?పై ఫొటోలో ఉన్న పాప మరెవరో కాదు సామజవరగమన హీరోయిన్ రెబా మోనికా జాన్. అందులో ఉన్నది తన పేరెంట్స్. మూవీ సూపర్ హిట్ కావడంతో మోనిక జాన్ చిన్నప్పటి, అరుదైన ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.
బెంగళూరులోని ఓ మలయాళ కుటుంబంలో పుట్టింది రెబా మౌనిక. చదువుతున్నప్పుడే మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరించింది. ఈక్రమంలోనే మలయాళంలో నివిన్ పౌలీ ‘జాకోబింటే స్వర్గరాజ్యం’ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత విజయ్ నటించిన బిగిల్ (తెలుగులో విజిల్) సినిమాలో ఓ కీలక పాత్ర పోషించింది. ఈ మూవీతోనే తెలుగు ప్రేక్షకులకు కూడా మొదటిసారిగా తను ఇంట్రడ్యూస్ అయ్యింది. కొన్ని రోజుల క్రితం ఓటీటీలో రిలీజైన బూ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ స్నేహితురాలిగా మెప్పించింది. ఇప్పుడు సామజవరగమనతో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఈమెకు తెలుగులో ఇదే ఫస్ట్ సినిమా కావడం విశేషం. అన్నట్లు రెబా మౌనికకు గతేడాదే వివాహమైంది. జీమోన్ జోసెఫ్ అనే వ్యక్తిని ఆమె పెళ్లాడింది.