Viral News: 3 ఏళ్ల కొడుకుని చంపేందుకు ప్లాన్ చేసిన తల్లి.. కిల్లర్ కోసం ఆన్ లైన్లోనే సెర్చ్..తన తనయుడిని చంపేందుకు ఆ తల్లే ప్లాన్ కూడా చెప్పింది. తన కొడుకు అమ్మమ్మ దగ్గరే ఉంటున్నాడని మహిళ చిన్నారి ఫోటో, తన పుట్టినిల్లు అడ్రెస్, అమ్మమ్మ మొబైల్ నంబర్‌ను ఇచ్చింది. వెబ్‌సైట్‌ను నడుపుతున్న ఒక వ్యక్తి ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు.అమెరికాలో ఓ తల్లి తన సొంత కుమారుడిని చంపేందుకు కిల్లర్ ను నియమించుకుంది. ఫ్లోరిడాలోని మయామిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. 18 ఏళ్ల యువతి తన మూడేళ్ల కొడుకును చంపడానికి ప్రయత్నించింది. ఆ చిన్నారిని చంపించడానికి ఆ మహిళ హిట్ ఫర్ హైర్ వెబ్‌సైట్‌కి వెళ్లి కిల్లర్ తో ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నించింది. ఈ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వాస్తవానికి మయామి మొదట తన బిడ్డను చంపేందుకు ప్రయత్నించినట్లు అనుమానిస్తున్నారు. అయితే ఆ ప్రయత్నం సక్సెస్ అవ్వకపోవడంతో.. తన పిల్లాడిని చంపడానికి ఒక కిల్లర్ ను ఎంచుకుంది. ఈ విషయం వెలుగులోకి వచ్చిన 18 ఏళ్ల తల్లిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, ఆమె తన నేరాన్ని అంగీకరించింది. తన కుమారుడిని చాలా దూరం, దూరంగా తీసుకెళ్లి… వీలైనంత త్వరగా చంపేయాలని తాను కోరుతున్నానని ఆ మహిళ కోర్టుకు తెలిపింది. ఇందుకోసం మూడు వేల డాలర్లు చెల్లించేందుకు ఆ మహిళ సిద్ధంగా ఉన్నట్లు మియామీ పోలీసులు తెలిపారు.సోషల్ మీడియాలో పోస్ట్
నిజానికి ఆ యువతి హిట్-ఫర్-హైర్ వెబ్సైట్లో “ఒకసారి .. తాను ఏదైనా చేయాలనుకుంటున్నాను” ఒక కిల్లర్ కావాలని అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసింది. అంతేకాదు తన కొడుకు ఫోటోను కూడా పోస్ట్ కి జత చేసింది. తన తనయుడిని చంపేందుకు ఆ తల్లే ప్లాన్ కూడా చెప్పింది. తన కొడుకు అమ్మమ్మ దగ్గరే ఉంటున్నాడని మహిళ చిన్నారి ఫోటో, తన పుట్టినిల్లు అడ్రెస్, అమ్మమ్మ మొబైల్ నంబర్‌ను ఇచ్చింది. వెబ్‌సైట్‌ను నడుపుతున్న ఒక వ్యక్తి ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. ఆ యువతి ఐపి అడ్రస్ ను కూడా ట్రాక్ చేసి పోలీసులకు తెలిపాడుయువతికి కోర్టు $15,000 జరిమానా
అయితే చిన్నారిని చంపించాలనుకున్న కసాయి తల్లి పేరు వెల్లడించలేదు పోలీసులు. చిన్నారి అమ్మమ్మతో డిటెక్టివ్లు మాట్లాడగా.. రెండు నెలల క్రితమే ఆ బాలుడి తల్లి ఇల్లు వదిలి వెళ్లిపోయినట్లు గుర్తించారు. ఆ యువతి తన బిడ్డను ద్వేషిస్తుంది. మంగళవారం ఆ మహిళను ఆమె తండ్రి ఇంటిలో అరెస్టు చేశారు. ఆ యువతి తన నేరాన్ని అంగీకరించింది. తనకు ఎలాంటి మానసిక సమస్యలూ లేవని ఆ మహిళ కోర్టుకు తెలిపింది. ఆ మహిళకు కోర్టు $15,000 జరిమానా విధించి.. గురువారం విడుదల చేసింది.