Ileana D’Cruz: కడుపులో బేబీ తన్నుతుంది.. ఆసక్తికర పోస్ట్ షేర్ చేసిన ఇలియానాసినిమాలకు దూరంగా ఉంటున్నా ఇలియానా పేరు మాత్రం వైరల్ అవుతూనే ఉంటుంది. హీరోయిన్ గా కంటే ఇప్పుడు ఈ అమ్మడు ఎక్కువ పాపులర్ అవుతుంది. హీరోయిన్ గా ఇలియానా ఒకానొక టైం లో టాలీవుడ్ లో రాణించింది. తెలుగులో దేవదాసు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తక్కువ సమయంలోనే భారీ ఆఫర్స్ ను అందుకుంది. అలాగే మహేష్ బాబు నటించిన బిగెస్ట్ బ్లాక్ బస్టర్ పోకిరి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత వరుస ఆఫర్స్ […]సినిమాలకు దూరంగా ఉంటున్నా ఇలియానా పేరు మాత్రం వైరల్ అవుతూనే ఉంటుంది. హీరోయిన్ గా కంటే ఇప్పుడు ఈ అమ్మడు ఎక్కువ పాపులర్ అవుతుంది. హీరోయిన్ గా ఇలియానా ఒకానొక టైం లో టాలీవుడ్ లో రాణించింది. తెలుగులో దేవదాసు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తక్కువ సమయంలోనే భారీ ఆఫర్స్ ను అందుకుంది. అలాగే మహేష్ బాబు నటించిన బిగెస్ట్ బ్లాక్ బస్టర్ పోకిరి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత వరుస ఆఫర్స్ తో దూసుకుపోయింది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ ఈ చిన్నది సినిమాలు చేసి హిట్స్ అందుకుంది. దళపతి విజయ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. అదేవిధంగా బాలీవుడ్ లోనూ పలు సినిమాలు చేసింది. బాలీవుడ్ లో ఆఫర్స్ రావడంతో సౌత్ ను లైట్ తీసుకుంది.ఇక అక్కడ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. లవ్, బ్రేకప్, డిప్రషన్ చకచకా జరిగిపోయాయి ఇలియానా లైఫ్ లో.. అదే సమయంలో ఇలియానా లావు కావడం కూడా జరిగింది. బొద్దుగా మారిన తర్వాత తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చింది. రవితేజతో కలిసి ఓ సినిమా చేసింది. కానీ ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దాంతో మరో తెలుగు సినిమా ఛాన్స్ రాలేదు.
ఇదిలా ఉంటే ఇప్పుడు తిరిగి సన్నజాజిలా మారి అవకాశలకోసం ఎదురు చూస్తుంది. కానీ అంతలోనే నేను గర్భవతిని అని షాక్ ఇచ్చింది. బేబీ బంప్ తో ఫోటోలు పెడుతూ సోషల్ మీడియాలో సెన్సషన్ గా మారింది. దాంతో ఆమె అభిమానులంతా ఇలియానా బాయ్ ఫ్రెండ్ ఎవరా.? అని కనిపెట్టే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో పోస్ట్ చేసింది ఇల్లి బేబి. ప్రస్తుతం ఇలియానాకు తొమ్మిది నెలలు. కడుపులో బేబీ తన్నుతుంది అంటూ ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చింది. అలాగే కొన్ని పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నా అంటుంది ఇలియానా.