Chittoor: చెక్పోస్ట్ దగ్గర పోలీసుల సాధారణ తనిఖీలు.. అటుగా వెళ్తున్న కూలీల వేషధారణ చూడగా.!Chittoor Police Arrested 6 Persons Who Smuggled Red Sandal Wood
Chittoor: చెక్పోస్ట్ దగ్గర పోలీసుల సాధారణ తనిఖీలు.. అటుగా వెళ్తున్న కూలీల వేషధారణ చూడగా.!చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరు పోలీస్స్టేషన్ పరిధిలో అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న కూలీలను పోలీసులు అరెస్ట్ చేసారు. వారి నుంచి 6 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల టీమ్ పీలేరు మెయిన్ రోడ్ లో తనిఖీలు చేస్తుండగా కొమిరెడ్డి గారి పల్లి క్రాస్ వద్ద కూలీలు కొందరు ఎర్రచందనం దుంగలను మోసుకుని వస్తూ కనిపించారు.వారిని సమీపించి చుట్టుముట్టేసరికి లొంగిపోయారు. మొత్తం 6 దుంగలను స్వాధీనం చేసుకుని కూలీలను స్టేషన్కు తీసుకువచ్చి కేసు నమోదు చేసారు పోలీసులు. కూలీలకు చెందిన ఇన్నోవా, బొలెరో వాహనాలతో పాటు ఓ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ ఎర్రచందనం కూలీలు తమిళనాడులోని తిరువన్నామలై జిల్లాకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.