Rahul Gandhi: పొలం బాటపట్టిన రాహుల్ గాంధీ.. రైతులతో కలిసి వరి నాట్లు వేసిన కాంగ్రెస్ నేత..సోనిపట్‌లోని బరోడా నియోజకవర్గంలోని పలు గ్రామాల పొలాల్లో పని చేస్తున్న రైతులతో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్ రైతులతో కలిసి వరి నాట్లు కూడా వేశారు. రాహుల్ గాంధీ రైతులతో కలిసి మదీనా, బరోజాలో వరి నాట్లు వేశారు. ఈ సమయంలో రాహుల్ గాంధీ కూడా ట్రాక్టర్ నడుపుతూ కనిపించారు.కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సిమ్లా పర్యటనకు బయలుదేరారు. దారిలో సోనిపట్ వద్ద కూడా ఆగి పొలాల్లో పని చేస్తున్న రైతుల మధ్యకి అకస్మాత్తుగా చేరుకున్నారు. ఈ సందర్భంగా రైతులు, కూలీలతో మాట్లాడి వారి ఆలోచనలను తెలుసుకున్నారు. సోనిపట్‌లోని బరోడా నియోజకవర్గంలోని పలు గ్రామాల పొలాల్లో పని చేస్తున్న రైతులతో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్ రైతులతో కలిసి వరి నాట్లు కూడా వేశారు. రాహుల్ గాంధీ రైతులతో కలిసి మదీనా, బరోజాలో వరి నాట్లు వేశారు. ఈ సమయంలో రాహుల్ గాంధీ కూడా ట్రాక్టర్ నడుపుతూ కనిపించారు.వాస్తవానికి రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్రతో ఇమేజ్ పెరిగింది. రాహుల్ గాంధీ సాధారణ ప్రజల మధ్య గడుపుతూ వారి సమస్యలను తెలుకుంటూ వారి మధ్య ఉంటూ తన సమయాన్ని గడిపారు. కర్నాటక ఎన్నికల్లోనూ ఈ యాత్ర ప్రభావం కనిపించింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ డెలివరీ బాయ్స్ నుంచి బస్సుల్లో ప్రయాణించే మహిళల వరకు చాలా మందిని కలిశారు. ఇప్పుడు సోనిపట్‌లో కూడా పొలాల్లో పని చేస్తున్న రైతుల మధ్యకు చేరుకుని వారితో మాట్లాడారు.
సిమ్లాలో రాహుల్ గాంధీ మరోవైపు, పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. రెండేళ్ల శిక్షను సమర్థించింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ సిమ్లా పర్యటన జరుగుతోంది. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు ప్రదర్శనలు చేశారు. సిమ్లాలో రాహుల్ గాంధీకి మద్దతుగా నినాదాలు చేశారు. బీజేపీ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తలుపు తట్టడంపై కూడా చర్చ జరిగింది. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి 2 సంవత్సరాల శిక్ష పడిన తర్వాత రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దు చేయబడింది. ఈడీ, సీబీఐల ద్వారా బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. దీంతో పాటు పార్టీ నేతలు ప్రతి పరిస్థితిలోనూ రాహుల్ గాంధీకి అండగా నిలుస్తామని చెప్పారు.