Hyderabad: పైకి చూసేందుకు సబ్బులే.. దాని లోపల సాగుతున్న చీకటి దందా గురించి తెలిస్తే షాకే.. !హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం డ్రగ్స్ రవాణాకు అడ్డాగా మారుతోంది.. విదేశాల నుండి దొడ్డి దారిన డ్రగ్స్ తెస్తూ పట్టుబడుతున్నారు కొందరు. తనిఖీలు తప్పించుకుని కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పి వివిధ మార్గాల్లో డ్రగ్స్ తమ వెంట తెస్తున్నారు. డ్రగ్స్ తీసుకు వచ్చేందుకు స్మగ్లర్లు ఎంచుకుంటున్న కొత్తకొత్త మార్గాలు కస్టమ్స్ అధికారులను సైతం ఔరా అనిపిస్తున్నాయి..హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం డ్రగ్స్ రవాణాకు అడ్డాగా మారుతోంది.. విదేశాల నుండి దొడ్డి దారిన డ్రగ్స్ తెస్తూ పట్టుబడుతున్నారు కొందరు. తనిఖీలు తప్పించుకుని కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పి వివిధ మార్గాల్లో డ్రగ్స్ తమ వెంట తెస్తున్నారు. డ్రగ్స్ తీసుకు వచ్చేందుకు స్మగ్లర్లు ఎంచుకుంటున్న కొత్తకొత్త మార్గాలు కస్టమ్స్ అధికారులను సైతం ఔరా అనిపిస్తున్నాయి.. తాజాగా మరోసారి ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపుతోంది. హైదరాబాద్ నగరంలోకి డ్రగ్స్ స్మగ్లింగ్ కాకుండా అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఏదో ఒక మార్గంలో డ్రగ్స్ సరఫరా అనేది కొనసాగుతూనే ఉంది. ఎక్కువగా ఎయిర్ పోర్టులను అడ్డాగా మార్చుకొని విదేశాల నుంచి అనేక పద్ధతులలో డ్రగ్స్‌ను కస్టమర్లకు సరఫరా చేసే ప్రయత్నం చేస్తున్నారు. బ్యాగులు, దుస్తులు, తినే పదార్థాలు, శరీర భాగాల్లో సైతం డ్రగ్స్ పాకెట్స్ ను పెట్టుకొని వాటిని స్మగ్లింగ్ చేసేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు డ్రగ్ పెడలర్స్. దీంతో ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్న విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు నిందితులను ఇట్టే పసిగడుతున్నారు. డ్రగ్స్ తరలిస్తున్న నిందితులను మొదట్లోనే పట్టుకోవడంతో వీళ్ళ అసలు గుట్టంతా బట్టబయలు అవుతుంది..
సూర్య నటించిన వీడొక్కడే సినిమా తరహాలో వివిధ రకాలుగా వేషాలను, వస్త్రధారణలు మార్చి గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ తరలిస్తున్నారు స్మగ్లర్లు. సినిమాల్లో డ్రగ్స్ కింగ్ పిన్ ఎవరు అనే అంశాన్ని పాత్రల ద్వారా చూపించినప్పటికీ నిజజీవితంలో కింగ్ పిన్ ఎవరు అని దానిమీద ఇప్పటికి కొన్ని డ్రగ్స్ కేసుల్లో దర్యాప్తులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కోట్లు విలువచేసి డ్రగ్స్ పట్టుపడింది. సబ్బుల మాటున భారీగా హెరాయిన్ తరలిస్తుండగా పక్కా సమాచారంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు కస్టమ్స్ అధికారులు. డ్రగ్స్ ఒకవేళ ఎయిర్పోర్ట్ దాటి బయటకు వస్తే ఎవరెవరికి విక్రయిస్తున్నారని అంశాలు ప్రస్తుతం తెరమీదకు వస్తున్నాయి. తాజాగా కబాలి నిర్మాత కెపి చౌదరి కేసులో వ్యాపారవేత్తల నుంచి మొదలుకుంటే సినీ రాజకీయ ప్రముఖుల పేర్లు సైతం బయటకు వచ్చాయి.. దీంతో వివిధ దేశాల నుంచి వచ్చిన నిందితులు ఎవరికి డ్రగ్స్‌ను సప్లై చేసేందుకు వస్తున్నారు అనేది ప్రశ్నార్ధకంగా మారింది… మరోవైపు కొన్ని పబ్బులు తో టై అప్ అయ్యి డ్రగ్స్ ను విక్రయిస్తున్నారా అనే అంశాలు ఆందోళనను కలిగిస్తున్నాయిశంషాబాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడింది.. కమిషన్ కు ఆశపడి ఏకంగా రూ. 14 కోట్లు విలువ డ్రగ్స్ తీసుకు వచ్చిందో మహిళ. విదేశాల నుండి హేరాయిన్, కోకైన్ లను వివిధ మార్గాల్లో నగరానికి తీసుకొస్తున్నా ఇక్కడ రిసీవర్ లకు చేరే లోపే వారిని పట్టుకుంటున్నారు అధికారులు. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా, టాంజానియా లాంటి దేశాల వారు అక్కడి మాఫియా అదేశాల ను పాటిస్తూ దేశాలు దాటి సిటీ కి డ్రగ్స్ ను చేరుస్తున్నారు. అంతా బాగుంది అనుకునే లోపే విమానాశ్రయం లో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో పట్టు బడుతున్నారు. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా,బురుండి దేశాల నుండి ఎక్కువ మొత్తంలో డ్రక్స్ సిటీకి చేరుతున్నట్లు అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. అనుమానంగా ఉన్న ప్రతి వ్యక్తినీ పగడ్బందీగా స్కాన్ చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు. బురుండి దేశానికి చెందిన ఒక మహిళ నుండి 14 కోట్లు విలువ చేసే హెరాయున్ ను స్వాధీనం చేసుకున్నారు. తాను తీసుకొస్తున్న ట్రాలీ బ్యాగ్ లో దుస్తులు, హ్యాండ్ బ్యాగ్‌లు, సబ్బులు పెట్టి వాటి మధ్యలో డ్రగ్స్ పౌడెర్ ను తీసుకొచ్చింది. ఆమెను క్షుణ్ణంగా తనిఖీ చేసి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అయితే అధికారుల దర్యాప్తులో సిటీలో డ్రగ్స్ రిసీవర్ ఎవరు అనే అంశంపై మాత్రం ఎటువంటి సమాచారం ఇవ్వలేదు ఆ యువతి.సాధారణ బరువు కంటే ఎక్కువ బరువు ఉండటంతో అధికారులకు అనుమానం వచ్చి క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు . అలా అధికారులకు పట్టుబడుతున్న వారు ఎక్కువ శాతం దుబాయ్ నుండే బంగారం గాని డ్రగ్స్ గానీ తీసుకొస్తున్నారు.. వస్తున్న పాసింజర్లు మహిళల, పురుషుల అనేదంట్లో సంబంధం లేకుండా వారికి కమిషన్లు ఏరచూపి దేశాలు దాటి చేస్తున్నారు మాఫియా గాళ్లు. ఇదే కాకుండా నగరానికి డ్రగ్స్ తీసుకు వచ్చేందుకు స్మగ్లర్లు అవలంభిస్తున్న మార్గాలు కస్టమ్స్ అధికారులను షాక్ కు గురి చేస్తున్నాయి . స్మగ్లర్లు కస్టమ్స్ అధికారులుకు దొరక్కుండా డ్రగ్స్ తీసుకు వచ్చేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఒకసారి బ్యాగుల్లో..మరోసారి దుస్తుల్లో.. చివరికి లో దుస్తుల్లో ఇలా ఎక్కడో ఒక చోట డ్రగ్స్ ఉంచి నగరానికి తీసుకు వస్తున్నారు. చిన్న చిన్న ప్యాకెట్ల లో ప్యాక్ చేసి తనిఖీల కళ్లు గప్పి ఎయిర్ పోర్ట్ దాటి వచ్చేస్తున్నారు..ఈ మధ్య కాలంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు పటిష్టం కావడంతో సినిమా స్టయిల్లో డ్రగ్స్ రవాణా చేస్తున్నారు. చివరకు కడుపులో డ్రగ్స్ ఉంచుకుని అక్రమ్మంగ రవాణా చేసే ప్రయత్నం చేస్తున్నారు ..అధికారులు అలాంటి వారిపై కూడా నిఘా పెట్టీ అదుపులోకి తీసుకున్నారు..ఇలా డ్రగ్స్ రిసీవర్ లు ఎవరో తెలియక విదేశాల నుండి తీసుకొస్తున్న డ్రగ్స్ ను కమిషన్ లకు ఆశపడి తెస్తూ తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు ఇతర దేశస్థులు..అయితే సిటీలో ఈ డ్రగ్స్ ను ఎవరికి చేర్చెందుకు ఇన్ని ప్రయత్నాలు మాఫియా చేస్తుంది అనే ప్రశ్నకు ఎప్పటికీ సమాధానం దొరుకుతుందో వేచి చూడాలి.