Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్ చేసిన వాతావరణ శాఖ..ఈ ప్రదేశాల్లో పిడుగులు పడే అవకాశం.తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. రెండు రాష్ట్రాల్లోనూ రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. తెలంగాణలో నాలుగు రోజులు, ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు…తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. రెండు రాష్ట్రాల్లోనూ రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. తెలంగాణలో నాలుగు రోజులు, ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. అంతేకాకుండా అక్కడక్కడా పిడుగులు కూడా పడే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు అప్రమత్తతో ఉండాలని అధికారులు సూచించారు.
ఇదిలా ఉంటే ఆదివారం హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. వర్షాలు పడుతున్న నేపథ్యంలో రైతులు, కూలీలు, గొర్రెల కాపరులు జాగ్రత్తగా ఉండాలని, చెట్ట కింద ఉండకూదని అధికారులు సూచించారు. ఈ ఏడాది రుతుపవనాలు ఆలస్యమైన కారణంతో తెలంగాణతోపాటు, ఆంధప్రదేశ్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వానలు జోరందుకున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది..జూన్ 22న రాష్ట్రంలోకి వచ్చిన నైరుతి వచ్చిన రుతుపవనాలతో చాలా చోట్ల మోస్తరు వానలే కురిశాయి. జూన్‌లో సాధారణం కంటే 46 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లా పాడేరులో మాత్రం పొగ మంచు కమ్మేసింది. ఉదయాన్నే పొగ మంచు దట్టంగా కురుస్తోంది. పొగ మంచు కారణంతో రోడ్డు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏజెన్నీ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్మేసింది.