Bandla Ganesh: ఇకపై పవన్‌కి దూరంగా ఉంటా.. ఆయన పేరు వాడుకోను.. బండ్ల గణేష్ సంచలన ట్వీట్బండ్ల గణేష్ పేరు ఎత్తగానే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఆయనతో తీన్మార్, గబ్బర్ సింగ్ వంటి హిట్ సినిమాలు తీసిన ఈ నిర్మాత పవన్‌కు వీరాభిమానుడిగా చెప్పుకుంటారు. ఇక వివిధ ఆడియో ఫంక్షన్లలో పవన్ గురించి బండ్ల ఇచ్చిన స్పీచ్‌లు ఓ రేంజ్లో సెన్సేషన్ సృష్టించాయి. ఇక సోషల్ మీడియాలోనూ తరచూ పవన్ నామజపమే చేస్తుంటారు బండ్ల.బండ్ల గణేష్.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అవసరం లేని పేరు. మొదట నటుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన ఆ తర్వాత నిర్మాతగా మారారు. గబ్బర్ సింగ్, బాద్షా, ఇద్దరమ్మాయిలతో, టెంపర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను నిర్మించారు. ఇక తెలంగాణ రాజకీయాల్లోనూ చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఇక బండ్ల గణేష్ పేరు ఎత్తగానే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఆయనతో తీన్మార్, గబ్బర్ సింగ్ వంటి హిట్ సినిమాలు తీసిన ఈ నిర్మాత పవన్‌కు వీరాభిమానుడిగా చెప్పుకుంటారు. ఇక వివిధ ఆడియో ఫంక్షన్లలో పవన్ గురించి బండ్ల ఇచ్చిన స్పీచ్‌లు ఓ రేంజ్లో సెన్సేషన్ సృష్టించాయి. ఇక సోషల్ మీడియాలోనూ తరచూ పవన్ నామజపమే చేస్తుంటారు బండ్ల. ఈక్రమంలో తాజాగా మరోసారి పవర్ స్టార్‌పై ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారాయన . గురు పౌర్ణమి సందర్భంగా తన గురువు పవన్ కల్యాణ్‌కు విషెస్ చెప్పిన ఆయన ఇకపై ఆయన పేరును వాడకోనంటూ సంచలన ప్రకటన చేశాడు.‘గురు పూర్ణిమ సందర్భంగా మా గురువుకి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మీరు మీలాగే ఉండాలి. మీరు అనుకున్నవన్ని సాధించాలి. కసితో కృషితో మీరు అనుకున్నవన్నీ సాధిస్తారు. మీ స్థాయి ఏంటో? మీ స్థానం ఏంటో? తెలిసిన వాడిగా చెబుతున్నా.. ఎప్పుడు ఏ విధంగా మీ కీర్తిని గానీ మీ పేరుని వాడుకొని లబ్ధి పొందను. పొందటానికి కూడా ప్రయత్నించను. వీలైతే మీకు సహాయంగా ఉంటాను. లేకపోతే దూరంగా ఉంటాను. అంతేకానీ మిమ్మల్ని ఏ విధంగా వాడుకొని నేను ఏ విధమైన లబ్ధి పొందనని, గురు పౌర్ణమి సందర్భంగా గురువు సాక్షిగా చెప్తున్నాను. నా చూపు నా ఆశ ఒకటే మీరు అనుకున్న ఆశయం సాధించాలి. సాధిస్తారు కూడా . మీ నిస్వార్థమైన మీ మనసులాగే మీరు పది కాలాలపాటు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ.. మీ బండ్ల గణేష్’ అని ట్వీట్ చేశారు బండ్ల. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఏందన్నా.. ఏమైంది? ఎందుకింత ఎమోషనల్ అయ్యావ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా గత కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు బండ్ల. మళ్లీ తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు.