Viral Video: సాహసం చేస్తూ 40 అడుగుల ఎత్తు నుంచి పడిపోయిన బాలుడు.. వీడియో చూస్తే గుండెఝల్లుమంటుంది..పిల్లవాడు జిప్ లైన్ సాహసాన్ని ఆస్వాదిస్తూ చేశాడు. ఆ బాలుడి వెనుక ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఆ బాలుడు తండ్రి కావచ్చు. ఆ వ్యక్తి బాలుడితో కలిసి సాహసం చేస్తూ.. బాలుడిని ముందుకు నెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. కొన్ని సెకన్ల పాటు అంతా బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది.. అయితే అకస్మాత్తుగా బాలుడి శరీరానికి కట్టిన తాడు విడిపోయింది. లేదా తెరుచుకున్నట్లుంది.ప్రపంచంలో సాహసాలు చేయడానికి ఇష్టపడేవారు అనేకమంది ఉన్నారు. ఎత్తైన పర్వతాలు ఎక్కడం, పర్వతాల నుండి, లోయల నుంచి క్రిందికి దూకడం, గాలిలో చక్కర్లు కొడుతూ విన్యాసాలు చేయడం, నీటిలో డైవింగ్ చేయడం వంటి అనేక సాహసాలను చేస్తూ ఉంటారు. చాలామంది వీటిని క్రీడలుగా భావిస్తారు. అయితే కొన్ని క్రీడలు ప్రాణాలను కూడా తీసేటంత ఘోరంగా ఉంటాయి. ఈ సాహసాలను చేసే సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా జీవితంపై భారంగా మారుతుంది. అయితే ప్రమాదాలను పట్టించుకోకుండా పెద్దలు మాత్రమే కాదు పిల్లలు కూడా సాహసాలు చేస్తూ తమ ప్రాణాలతో పాటు చిన్నారుల ప్రాణాలను సైతం ప్రమాదంలో పడేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూస్తే గూస్బంప్స్ రావడం ఖాయం.వైరల్ అవుతున్న వీడియోలో కేవలం 6 ఏళ్ల పిల్లవాడు సాహసం చేస్తూ 40 అడుగుల ఎత్తున ఉన్న రోప్ మీద జర్నీ చేస్తున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో భయాందోళనలను సృష్టించింది. పిల్లవాడు జిప్ లైన్ సాహసాన్ని ఆస్వాదిస్తూ చేశాడు. ఆ బాలుడి వెనుక ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఆ బాలుడు తండ్రి కావచ్చు. ఆ వ్యక్తి బాలుడితో కలిసి సాహసం చేస్తూ.. బాలుడిని ముందుకు నెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. కొన్ని సెకన్ల పాటు అంతా బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది.. అయితే అకస్మాత్తుగా బాలుడి శరీరానికి కట్టిన తాడు విడిపోయింది. లేదా తెరుచుకున్నట్లుంది. దీంతో పిల్లవాడు నేరుగా కింద పడిపోయాడు. జిప్ లైన్ ఎత్తు 12 మీటర్లు అంటే దాదాపు 40 అడుగులు అని తెలుస్తోంది.హృదయాన్ని కదిలించే ఈ ఘటన మెక్సికోలోని మోంటెర్రీలోని ఒక పార్క్ లో జరిగినట్లు తెలుస్తోంది. ఆ చిన్నారికి ఏం జరిగిందనేది వీడియోలో చూపించనప్పటికీ.. ఈ ఘటన నిజంగా జరిగితే మాత్రం బాలుడు పరిస్థితి విషమంగా ఉండడం ఖాయమని చెప్పవచ్చు.ఎవరైనా సరే మీ పిల్లలతో కలిసి ఇలాంటి ప్రమాదకరమైన సాహసాలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లయితే, ఈ వీడియో అటువంటి వారికి ఒక గుణపాఠం.. ప్రతి ఒక్కరి కళ్లు తెరిపిస్తుంది. ప్రమాదం ఎప్పుడైనా, ఎవరికైనా జరగవచ్చు. కనుక సాహసాలు చేసే సమయంలో అనుకోని ప్రమాదం ఏర్పడితే నెక్స్ట్ పరిస్థితి ఏమిటి అని ఆలోచించాలని ప్రతి ఒక్కరూ కామెంట్ చేస్తున్నారు.