Onion Price: టమాటా బాటలో ఉల్లి పయనం.. 4 రోజుల్లోనే ఉల్లి ధర భారీగా పెరుగుదలగత కొంతకాలంగా టమాటో ధర పై పై కి చేరుకుంటూ సామాన్యుడి చుక్కలు చూపిస్తుంటే.. తాజాగా ఉల్లి కూడా కళ్లలో నీళ్లు తెప్పిస్తోంది. గత 4 రోజుల్లో ఉల్లి ధర కూడా భారీగా పెరుగుదల నమోదు చేసుకుంది. కిలో రూ.15 పలికిన ఉల్లి ధర ఇప్పుడు రూ.20 నుంచి 25కి చేరింది. ఈ విధంగా గత 4 రోజుల్లో ఉల్లి ధర కూడా రూ.10 పెరిగింది.సామాన్యుడికి కూరగాయల ధరలు, పప్పులు, వెల్లుల్లి సహా అనేక ఆహారపదార్ధాల ధరలు పైపైకి చేరుకుంటున్నాయి. ముఖ్యంగా భారతీయ వంటింట్లో తప్పనిసరిగా ఉండే ఉల్లి, టమాటా, కూరగాయల ధరలు రోజు రోజుకీ ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో సామాన్యుడు రానున్న రోజుల్లో తిండి గింజలకు తిప్పలు తప్పవని ప్రజలు అంటున్నారు. గత కొంతకాలంగా టమాటో ధర పై పై కి చేరుకుంటూ సామాన్యుడి చుక్కలు చూపిస్తుంటే.. తాజాగా ఉల్లి కూడా కళ్లలో నీళ్లు తెప్పిస్తోంది. గత 4 రోజుల్లో ఉల్లి ధర కూడా భారీగా పెరుగుదల నమోదు చేసుకుంది. కిలో రూ.15 పలికిన ఉల్లి ధర ఇప్పుడు రూ.20 నుంచి 25కి చేరింది. ఈ విధంగా గత 4 రోజుల్లో ఉల్లి ధర కూడా రూ.10 పెరిగింది.ఉల్లిపాయల హోల్‌సేల్ మార్కెట్ లో 25 శాతం పెరిగింది. అనేక ఉల్లి మార్కెట్లలో శుక్రవారం క్వింటాల్ ఉల్లిపాయల ధర 1300 రూపాయలకు చేరుకుంది. రానున్న రోజుల్లో ఉల్లి ధర మరింత పెరిగే అవకాశం ఉందని దుకాణదారులు చెబుతున్నారు. జూన్ 27న నాసిక్ మండిలో ఉల్లి సగటు ధర క్వింటాల్‌కు రూ.1201గా ఉంది. అదే సమయంలో, మరుసటి రోజు దాని ధరలో రూ.79 పెరుగుదల నమోదైంది. ఈ విధంగా జూన్ 28న ఉల్లి ధర క్వింటాల్‌కు 1280కి పెరిగింది. మరోవైపు జూన్ 29న ఉల్లి ధర క్వింటాల్‌కు రూ.1280 నుంచి రూ.1300కి చేరుకుంది.
టమాటా తర్వాత ఉల్లి, కూరగాయల ధరలు కూడా పెరుగుతుండడంతో సామాన్యుడు జేబుకి చిల్లు పడుతోంది. ధరలు ఇదే విధంగా పెరిగితే రానున్న రోజుల్లో తిండి గింజలు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సంవత్సరం, మహారాష్ట్రతో పాటు, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో ఉల్లిపాయల పంట బాగా పండిందని అధికారులు చెబుతున్నారు. దీంతో ఫిబ్రవరి నెల చివరిలో, ధర పడిపోయింది. కిలో ఉల్లి పాయ రూపాయి నుంచి రెండు రూపాయలకు కూడా అమ్ముకోవాల్సిన దుస్థితికి రైతులకు నెలకొంది. దీంతో రైతు పంటకు పెట్టిన పెట్టుబడి రాక కంట కన్నీరు పెట్టారు. ఉల్లిని రోడ్డుపై పడేశారు.