Maharashtra: బుల్ధానాలో అగ్నికి ఆహుతైన బస్సు.. 25 మంది సజీవ దహనంBuldhana Fire: మహారాష్ట్రలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బుల్ధానాలో బస్సు అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది.— మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహారాష్ట్రలోని బుల్ధానాలోని సమృద్ధి మహామార్గ్ ఎక్స్‌ప్రెస్‌వేలో ప్రయాణిస్తోన్న బస్సులో హఠాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రైవేటు ట్రావెల్ బస్సు అగ్నికి ఆహుతైంది. బస్సులో ప్రయాణిస్తోన్న 25 మంది సజీవ దహనమయ్యారు. ఒకరు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందారు. మొత్తం ప్రమాదంలో మృతుల సంఖ్య 26కి చేరింది. మరో నలుగురి పరిస్థితి విషమంగా మారింది.— శుక్రవారం రాత్రి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు నాగ్‌పూర్ నుంచి పుణె బయలుదేరింది. రాత్రి అంతా భోజనం చేసి బస్సెక్కారు. క్రమంగా అంతా గాఢనిద్రలోకి జారుకున్నారు. తెల్లారితే గమ్య స్థానానికి చేరాలన్నది అందరి ప్లాన్. సమయం రాత్రి 2 గంటలు అవుతుంది. ఒక్కసారిగా కుదుపు. ఎక్కడో మొదలైన మంటలు క్షణాల్లో వ్యాపించాయి. హాహాకారాలు, పెడబొబ్బలు. అంతా మంటల్లో అంటుకున్నారు. అందరూ ఆర్తానాదాలు చేసే వారే తప్ప కాపాడే వారు లేరు. మంటల్లో ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. ఒక్కరు ఇద్దరు కాదు ఏకంగా 26 మంది ప్రాణాలు కోల్పోయారు. తెల్లారే సరికి అంతా బూడిదైపోయింది. శవాలు కాదు కదా.. తీసుకెళ్లేందుకు మాంసపు ముద్ద కూడా మిగలలేదు. రాత్రి 2 గంటల సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండగా బస్సు టైరు పేలిపోయి..బస్సు పల్టీ కొట్టింది. దీంతో నడుస్తున్న బస్సులోనుంచి హఠాత్తుగా మంటలు చెలరేగడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులు నిద్రలోనుంచి మేల్కొనేలోపే క్షణాల్లో బస్సులోని ప్రయాణికులు అగ్నికీలలకు బలయ్యారు.
— ప్రైవేటు ట్రావెల్‌కి చెందిన బస్సు నాగ్‌పూర్ నుంచి పూణే వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులున్నారు. మృతుల్లో మహిళలు అధికంగా ఉన్నారు. అగ్నికీలలను గుర్తించిన స్థానికులు బాధితులను హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.— సరిగ్గా పదేళ్ల కిందట మహబూబ్‌నగర్ జిల్లా పాలెం సమీపంలో జరిగిన ఘటనను ఇవాళ్టి ప్రమాదం గుర్తుకు తెస్తోంది. ఆరోజు ట్రావెల్స్ బస్సు యాక్సిడెంట్లో బస్సులో ఉన్న 45 మంది ప్రయాణికులు సజీవ దహనం అయిపోయారు. నాడు ప్రమాదం కారణంగా బస్సులో మంటలు చెలగరేగితే ఇప్పుడు.. రన్నింగ్ బస్సులో మంటలు చెలరేగి 26 మంది అగ్నికి ఆహుతి అయిపోయారు..