Pushpa 2: గాలిలో పుష్పరాజ్ ఫైట్.. పుష్ప 2 కోసం డూప్ లేకుండా ఆ సాహసం చేయనున్న బన్నీఈ సినిమాలో బన్నీ నటన , యాటిట్యూడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో పుష్ప రాజ్ గాదరగొట్టాడు బన్నీ. అలాగే ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ ను పాన్ ఇండియా స్థాయికి పెంచిన సినిమా పుష్ప. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. బన్నీ కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ గా నిలిచింది పుష్ప. ఇక ఈ సినిమాలో బన్నీ నటన , యాటిట్యూడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో పుష్ప రాజ్ గాదరగొట్టాడు బన్నీ. అలాగే ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ సినిమాలో సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటించాడు. అలాగే మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా నటించారు. పోలీస్ ఆఫర్స్ పాత్రలో నటించారు ఫదద్ . ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రానున్న విషయం తెలిసిందే. మొదటి పార్ట్ సంచనల విజయం సాధించడంతో ఇప్పుడు పార్ట్ 2 పై భారీ అంచనాలు పెరిగాయి.
ఇక ఈ మూవీ షూటింగ్ సైలెంట్ గా జరుగుతోంది. ఈ సెకండ్ పార్ట్ లో మొదటి భాగానికి మించిన యాక్షన్ సీన్స్, ట్విస్ట్ లు ఉండనున్నాయట. అందుకు తగ్గట్టుగా పవర్ ఫుల్ గా కథను మార్చరట సుకుమార్. అలాగే ఈ సినిమాలో అనసూయ పాత్ర కూడా చాలా కీలకం గా ఉండనుందట.
ఇదిలా ఉంటే ఈ మూవీలో యాక్షన్ సీన్స్ కోసం ఫారెన్ ఫైటర్స్ ను దింపుతున్నారట. అయితే ఈ సినిమాలో బన్నీ ఏకంగా గాలిలో ఫైట్ చేయనున్నాడట. 100 అడుగుల ఎత్తులో బన్నీ విలన్స్ తో ఫైట్ చేయనున్నాడని తెలుస్తోంది. ఇందుకోసం బన్నీని 100 అడుగుల ఎత్తులో వేలాడదీస్తారట. గాలిలో వెడలుడ్తూ విలన్స్ ను ఇరగదీస్తాడట. ఇందుకోసం బన్నీ డూప్ లేకుండా ఫైట్ చేశాడట. ఇప్పుడు ఇదే వార్త ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతుంది.