Telangana: డబ్బు విషయంలో గొడవ.. గర్భిణి అని కనికరం లేకుండా కత్తితో పొడిచిన భర్త..Tadvai News: డబ్బు ఏ సంబంధాన్నైనా విడదీస్తుంది.. ఈ విషయంలో సొంత వారు.. బయట వారు.. అనే ఊసే ఉండదు.. ఎవరినైనా పొట్టన బెట్టుకుంటుంది.. అందుకే.. డబ్బుతో జర జాగ్రత్త అంటారు పెద్దలు..Tadvai News: డబ్బు ఏ సంబంధాన్నైనా విడదీస్తుంది.. ఈ విషయంలో సొంత వారు.. బయట వారు.. అనే ఊసే ఉండదు.. ఎవరినైనా పొట్టన బెట్టుకుంటుంది.. అందుకే.. డబ్బుతో జర జాగ్రత్త అంటారు పెద్దలు.. తాజాగా.. భార్యాభర్తల మధ్య డబ్బు విషయమై గొడవ జరిగింది. భార్య గర్భిణి అయినప్పటికీ.. భర్త ఆమెపై చేయిచేసుకున్నాడు. అంతటితో ఆగకుండా.. నిండు గర్భిణి అని కూడా చూడకుండా భార్యను భర్త కత్తితో పొడిచాడు. ఈ దారుణ ఘటన తెలంగాణలోని ములుగు జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది.ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారానికి చెందిన అనిల్, శ్యామల భార్యా భర్తలు.. శ్యామల ప్రస్తుతం గర్భిణి. అయితే, భార్యాభర్తల డబ్బుల విషయమై గొడవ జరిగింది. ఇది కాస్త తీవ్ర రూపం దాల్చింది. ఈ క్రమంలో భర్త అనిల్.. క్షణికావేశంలో గర్భంతో ఉన్న భార్య శ్యామలను కత్తితో పొడిచాడు. శ్యామల గట్టిగా కేకలు వేయడంతో అనిల్ అక్కడి నుంచి పరారయ్యాడు.
గమనించిన స్థానికులు గర్భిణి శ్యామలను అంబులెన్స్ లో హుటాహుటినా ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. వెంటనే వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. ప్రస్తుతం ఎలాంటి ప్రాణాపాయం లేదని.. చికిత్స కొనసాగుతుందని వైద్యులు వెల్లడించారు.