యువ న్యాయవాదులకు శభువార్త. 2023-24 సంవత్సరానికి సంబంధించి మొదటి విడత ‘వైఎస్ఆర్ లా నేస్తం’ నిధులు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి నిధులను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 2,677 మంది యువ న్యాయవాదులు ఖాతాల్లో డబ్బులు జమ చేశారు సీఎం.
యువ న్యాయవాదులకు శభువార్త. 2023-24 సంవత్సరానికి సంబంధించి మొదటి విడత ‘వైఎస్ఆర్ లా నేస్తం’ నిధులు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి నిధులను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 2,677 మంది యువ న్యాయవాదులు ఖాతాల్లో డబ్బులు జమ చేశారు సీఎం. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకు నెలకు రూ. 5 వేలు చొప్పున అంటే ప్రతి వ్యక్తికి రూ. 25 వేల లెక్కన మొత్తం రూ. 6,12,65,000 డబ్బులు వారి ఖాతాల్లో జమ చేశారు.
కొత్తగా న్యాయవాద వృత్తిలోకి వచ్చిన యువ న్యాయవాదులకు అండగా ఉండే లక్ష్యంతో ‘వైఎస్ఆర్ లా నేస్తం’ పేరుతో నెలకు రూ. 5 వేల చొప్పున స్టైఫండ్ ఇస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా వీరికి మూడేళ్ల పాటు ఏడాదికి రూ. 60 వేల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు. అంటే మూడేళ్ల కాలంలో ప్రతి ఒక్కరికి రూ. 1.80 లక్షలు ఆర్థిక సాయం అందించనుంది ప్రభుత్వం.
ఈ పథకం అమల్లో భాగంగా ఈ ఏడాది మొదటి విడత నిధులను సోమవారం నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేశారు. ఇక ఇప్పటి వరకు ఈ పథకం కింద 5,781 మంది యువ న్యాయవాదులకు రూ. 41.52 కోట్లు చెల్లించింది రాష్ట్ర ప్రభుత్వం.
ఆర్థిక సాయం కోసం యువ న్యాయవాదులు ఆన్లైన్లో sec_law@ap. gov.in ద్వారా గానీ, నేరుగా లా సెక్రటరీకి గానీ దరఖాస్తు చేసుకోవాలి. ఇక వైఎస్ఆర్ లా నేస్తం పథకానికి సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఉంటే 1902 నెంబర్‌కు కాల్ చేయడం ద్వారా పరిష్కరించుకోవచ్చు అని ప్రభుత్వం తెలిపింది. కాగా, న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో లా, ఫైనాన్స్ సెక్రటరీ సభ్యులుగా రూ. 100 కోట్లతో అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నిధులతో న్యాయవాదులకు గ్రూప్ మెడిక్లెయిమ్స్, రుణాలు, ఇతర సహాయ కార్యక్రమాలు చేపడుతోంది. ఈ ట్రస్ట్ కింద ఇప్పటికే రూ. 25 కోట్ల సాయం అందించింది ప్రభుత్వం.