ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. వివో ఎక్స్ 90 పేరుతో తీసుకురానున్న ఈ స్మార్ట్ ఫోన్‌ను త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ ఫీచర్లపై ఓ లుక్కేయండి..
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. వివో ఎక్స్ 90 పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్‌ను త్వరలోనే లాంచ్ చేయనున్నారు. ఇంతకీ ఈ ఫోన్లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత లాంటి పూర్తి వివరాలు మీకోసం..
వివో ఎక్స్ 90 స్మార్ట్ ఫోన్‌ను 8జీబీ రామ్+256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్, 12 జీబీ రామ్+ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్, 12 జీబీ రామ్+ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ అనే మూడు వేరియంట్స్‌లో తీసుకురానున్నారు.
ఇక ఈ స్మార్ట్ ఫోన్ న్యూ మీడియా టెక్ డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్‌ను పనిచేస్తుంది. అలాగే ఇందులో 1.5 కే రిజల్యూషన్‌తో కూడిన 6.78 ఇంచెస్ కర్వ్డ్ అమోఎల్ఈడీ డిస్ప్లేను అందించనున్నారు.
అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను ఇవ్వనున్నారు. 1300 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతా చెప్పొచ్చు.
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్లో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాను ఇవ్వనున్నారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 59,900 నుంచి ప్రారంభంకానున్నట్లు సమాచారం.