కెరటం చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది రకుల్ ప్రీత్ సింగ్. హీరోయిన్ గా దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించింది. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో కథానాయకిగా మెప్పించింది. ఎన్టీఆర్: కథానాయకుడు చిత్రంలో శ్రీదేవి పాత్రలో ఆకట్టుకుంది. తెలుగులో చివరిగా వైష్ణవ్ తేజ్ సరసన కొండపోలం చిత్రంలో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాల్లో రాణిస్తుంది.