Telangana Congress: తెలంగాణలో అసలు ఆట మొదలైంది, ఇక బీఆర్ఎస్కి చుక్కలే అంటున్నారు పొంగులేటి. కాంగ్రెస్ పెద్దల్ని కలవడానికి ఢిల్లీ వెళ్లిన పొంగులేటి కీలక కామెంట్స్ చేశారు. కాంగ్రెస్‌లో చేరేది లాంఛనమే అయినా..
Telangana Congress: ఢిల్లీకి వెళ్లినా పొంగులేటి మాటల్లో ఏదో తేడా!. ఒకపక్క కాంగ్రెస్‌లో చేరడానికి రెడీ! ఇంకోవైపు నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పేందుకు వెనుకంజ!. అవును, కాంగ్రెస్ పెద్దల్ని కలవడానికి ఢిల్లీ వెళ్లిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అక్కడ కూడా అస్పష్టమైన కామెంట్సే చేశారు. కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు డైరెక్ట్‌గా చెప్పకుండా కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌గాంధీని కలిసిన తర్వాతే తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు పొంగులేటి. కాంగ్రెస్ పెద్దలు చెప్పేదాన్నిబట్టే తమ నిర్ణయం ఉంటుందన్నారు. తానొక్కడ్నే పార్టీ మారితే తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారిపోదంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నర్మగర్భ కామెంట్స్ చేశారు.
పొంగులేటి మాటల్ని బట్టి చూస్తుంటే, కాంగ్రెస్ పెద్దల ముందు భారీ డిమాండ్ల చిట్టానే పెట్టబోతున్నట్టు అర్ధమవుతోంది. మెయిన్‌గా తమ ముఖ్యఅనుచరులకు టికెట్ల కోసం పట్టుబట్టబోతున్నట్టు తెలుస్తోంది. పొంగులేటి అయితే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తాను సూచించినవాళ్లకే టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. తమ డిమాండ్లపై రాహుల్‌గాంధీ నుంచి హామీ వస్తేనే కాంగ్రెస్‌లో చేరే విషయాన్ని అధికారికంగా ప్రకటించాలని డిసైడ్ అయ్యారట పొంగులేటి అండ్ జూపల్లి. రేవంత్‌రెడ్డి అండ్ టీమ్ కలిసి మాట్లాడిన తర్వాత కూడా ఇలాంటి కామెంట్సే చేశారు పొంగులేటి. కొన్ని క్లారిటీస్ రావాల్సి ఉంది. అవి వచ్చాకే నిర్ణయం ప్రకటిస్తామని ఆనాడే చెప్పారు పొంగులేటి.
ఇవాళ మధ్యాహ్నం రాహుల్‌గాంధీతోపాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు సమావేశంకానున్నారు. రాహుల్‌తో భేటీ తర్వాత తమ నిర్ణయాన్ని, భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. పొంగులేటి, జూపల్లి.. కాంగ్రెస్‌లో చేరేది లాంఛనమే అయినా, చివరి క్షణం వరకూ సస్పెన్స్‌లు, ట్విస్ట్‌లతో పొలిటికల్ డ్రామాను రక్తికట్టిస్తున్నారు. మరి, హైడ్రామాకి ఇవాళ్టితో ఫుల్స్టాప్ పెడతారా! లేక ఇంకా కంటిన్యూ చేస్తారా! చూడాలి!