Gold and Silver Prices Today: బంగారం, వెండి లాంటి అభరణాలకు అంతర్జాతీయంగా ఎప్పుడూ డిమాండే ఉంటుంది. వివాహాలు, శుభకార్యాలు.. ఇలా ఎలాంటి కార్యక్రమాలున్నా.. మహిళలు వీటిని కొనేందుకు తెగ ఇష్టపడుతుంటారు.
Gold and Silver Prices Today: బంగారం, వెండి లాంటి అభరణాలకు అంతర్జాతీయంగా ఎప్పుడూ డిమాండే ఉంటుంది. వివాహాలు, శుభకార్యాలు.. ఇలా ఎలాంటి కార్యక్రమాలున్నా.. మహిళలు వీటిని కొనేందుకు తెగ ఇష్టపడుతుంటారు. ఇదిలాఉంటే.. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో మార్పులు జరుగుతుంటాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలకు తాజాగా బ్రేక్ పడింది. బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం ధరలు స్థిరంగా ఉండగా.. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.
దేశీయంగా పసిడి ధరలు..
చెన్నైలో పదిగ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ.54,550 ఉండగా.. 24 క్యారెట్స్ రూ.59,510 గా ఉంది. ఢిల్లీలో బంగారం ధర 22 క్యారెట్స్ రూ.54.400, 24 క్యారెట్స్ రూ.59,330, ముంబైలో పసిడి ధర 22 క్యారెట్స్ రూ.54,250, 24 క్యారెట్స్ రూ.59,180 గా ఉంది. బెంగుళూరులో 22 క్యారెట్స్ రూ.54,250, 24 క్యారెట్స్ రూ.59,180 గా ఉంది. హైదరాబాద్ లో బంగారం ధర 22 క్యారెట్స్ రూ. 54,250, 24 క్యారెట్స్ బంగారం రూ.59,180, విశాఖపట్నంలో 54,250, 24 క్యారెట్స్ రూ.59,180, విజయవాడలో 54,250, 24 క్యారెట్స్ రూ.59,180 గా ఉంది.
వెండి ధరలు..
ముంబైలో కిలో వెండి ధర రూ.70.900 గా ఉంది. చెన్నైలో రూ.74,500, ఢిల్లీలో రూ.70.900, బెంగళూరులో రూ.70,250 ఉంది. హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.74,500, విశాఖపట్నంలో రూ.74.500, విజయవాడలో రూ.74,500 లుగా కొనసాగుతోంది.
గమనిక.. బంగారం, వెండి ధరలు సోమవారం ఉదయం వరకు నమోదనైవి మాత్రమే.. మళ్లీ మారే అవకాశం ఉంటుంది.. కావున గమనించగలరు..