వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక మ్యాచ్లు ఆడిన జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది. భారత జట్టు ఇప్పటి వరకు 1029 మ్యాచ్లు ఆడింది. విశేషమేమిటంటే.. వన్డే క్రికెట్లో భారత్ మినహా మరే ఇతర జట్టు 1000 మ్యాచ్లు ఆడలేదు. 978 వన్డేలతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉండగా, పాకిస్థాన్ (953) మూడో స్థానంలో ఉంది.
వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక మ్యాచ్లు ఆడిన జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది. భారత జట్టు ఇప్పటి వరకు 1029 మ్యాచ్లు ఆడింది. విశేషమేమిటంటే.. వన్డే క్రికెట్లో భారత్ మినహా మరే ఇతర జట్టు 1000 మ్యాచ్లు ఆడలేదు. 978 వన్డేలతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉండగా, పాకిస్థాన్ (953) మూడో స్థానంలో ఉంది. ఇక్కడ అత్యధిక మ్యాచ్ లు ఆడిన భారత జట్టు ఓటమిలోనూ అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. మరి ఈ జాబితాలో ఏ జట్టు ఏ స్థానంలో ఉందో తెలుసుకుందాం రండి. వన్డే క్రికెట్లో టీమిండియా ఇప్పటివరకు 1029 మ్యాచ్లు ఆడింది. ఇందులో 539 మ్యాచ్లు గెలిచింది. అలాగే 438 మ్యాచ్ల్లో ఓడిపోయింది. అంటే వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక మ్యాచ్ల్లో ఓడిన జట్లలో టీమిండియాదే అగ్రస్థానం.
- వన్డే క్రికెట్లో 889 మ్యాచ్లు ఆడిన శ్రీలంక జట్టు కేవలం 403 మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది. 441 మ్యాచ్ల్లో ఓడి ఈ జాబితాలో 2వ స్థానంలో ఉంది.
- పాకిస్థాన్ జట్టు వన్డే క్రికెట్లో మొత్తం 953 మ్యాచ్లు ఆడింది. 503 మ్యాచ్లు గెలవగా.. 421 మ్యాచ్ల్లో ఓడిపోయింది.
- ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన కరీబియన్ వన్డే క్రికెట్లో మొత్తం 860 మ్యాచ్లు ఆడింది. అందులో 416 మ్యాచ్ల్లో గెలిస్తే.. 404 మ్యాచ్ల్లో ఓడిపోయింది.
- 562 వన్డే మ్యాచ్ల్లో జింబాబ్వే జట్టు 149 మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది. 392 మ్యాచ్ల్లో ఓడిపోయింది.
- వన్డే క్రికెట్లో 804 మ్యాచ్లు ఆడిన న్యూజిలాండ్ 369 మ్యాచ్లు గెలిచి 386 మ్యాచ్ల్లో ఓడింది.
- వన్డే క్రికెట్లో 804 మ్యాచ్లు ఆడిన న్యూజిలాండ్ 369 మ్యాచ్లు గెలిచి 386 మ్యాచ్ల్లో ఓడింది.
- వన్డే క్రికెట్లో మొత్తం 978 మ్యాచ్లు ఆడిన ఆస్ట్రేలియా 594 మ్యాచ్ల్లో విజయం సాధించింది. కాగా, 341 మ్యాచ్ల్లో ఓడిపోయింది.
- 412 వన్డే మ్యాచ్లు ఆడిన బంగ్లాదేశ్ జట్టు 252 మ్యాచ్ల్లో ఓడిపోయింది. కేవలం 151 మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది.
- దక్షిణాఫ్రికా 654 వన్డే మ్యాచ్ల్లో 399 మ్యాచ్లు గెలిచింది. అలాగే 228 మ్యాచ్ల్లో ఓడిపోయింది.