ఆచార్య చాణక్యుడి తన జీవితంలోని అనుభవసారాన్ని నీతి శాస్త్రంలో నేటి తరానికి అందించాడు. ఈ పుస్తకంలో పొందుపరిచిన విధానాలను అనుసరించే వ్యక్తి తన జీవితంలో ఎప్పుడూ ఇబ్బందుల్లో పడడు. పురుషుని సామర్థ్యమే స్త్రీలను సంతృప్తి పరుస్తుందని చాణక్యుడు చెప్పాడు.
విధేయత: కుక్క ఎలా విధేయత చూపుతుందో.. పురుషులు కూడా తమ భార్యలకు విధేయంగా ఉండాలి. అంతేకాదు తెలియని స్త్రీని చూసినా చలించని పురుషులను స్త్రీలు ఇష్టపడతారు. అటువంటి భర్త పట్ల భార్య అత్యంత శ్రద్దని చూపిస్తారు,
జాగరూకత: మనిషి కుక్కలా ఎల్లప్పుడూ.. ఎటువంటి పరిస్థితిలోనైనా అప్రమత్తంగా ఉండాలి. భార్య, కుటుంబం పట్ల తన విధులను జాగ్రత్తగా నిర్వహించాలి. అదే సమయంలో శత్రువుల పట్ల జాగరూకతతో ఉండాలి. ఇటువంటి గుణాలున్న భర్తను స్త్రీలు ఇష్టపడతారు.
శ్రద్ధ: పురుషులు కష్టపడి పనిచేయాలని ఆచార్య చాణక్యుడు చెప్పారు. కుక్క తాను సంపాదించినా దానితో తృప్తి చెందుతుంది. అదేవిధంగా మనిషి సంపాదించిన దానితో సంతృప్తి చెందాలి. ఈ గుణం ఉన్న పురుషులు సంతోషంగా ఉంటారు. భార్య మనసుని గెలుచుకోవడంలో విజయం సాధిస్తారు.
శౌర్యం: దైర్యం, నిర్భయం ఉండే జంతువులు కుక్కలు. కుక్కల వలెనే ఎటువంటి పరిస్థితులు ఎదురైనా మగవాళ్ళు కూడా నిర్భయంగా ఉండాలి. ఆపద సమయంలో తమ కుటుంబం, భార్య కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి వెనుకడుగు వేయని పురుషులను స్త్రీలు ఇష్టపడతారు.
సంతృప్తి: పురుషులు ఎల్లప్పుడూ తమ బాధ్యతలను నెరవేర్చాలని చాణక్య విధానంలో చెప్పబడింది. వారిని మానసికంగా, శారీరకంగా తృప్తిగా ఉంచే బాధ్యతను భార్యలు నిర్వర్తించాలి. అలాంటి పురుషులు భార్యలకు ప్రీతిపాత్రులు. వారి సంసారం సుఖ సంతోషాలతో సాగుతుంది.