రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు సోమవారం (జూన్ 26) నుంచి రెండు పూటలూ నిర్వహించనున్నామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల మూలంగా..
అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు సోమవారం (జూన్ 26) నుంచి రెండు పూటలూ నిర్వహించనున్నామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల మూలంగా జూన్ 12 నుంచి 24వ తేదీ వరకు ఒంటి పూట తరగతులను నిర్వహించారు. దీంతో విద్యార్ధులు ఉదయం 7.30 నుంచి 11.30 వరకు పాఠశాలలు నిర్వహించారు. మధ్యాహ్నం భోజనం తర్వాత విద్యార్ధులు 12 గంటలకు ఇల్లకు వెళ్లిపోయేవారు.
ఐతే రాష్ట్రంలో ప్రస్తుతం వాతావరణం సాధారణ స్థాయికి రావడంతో రెండు పూటలా తరగతులు నిర్వహించాలని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ రోజు నుంచి రెండు పూటలా బడులు జరగనున్నాయి.