భూమిపై ఓ చిన్న జీవి ఏ విషపు జంతువైనా చివరికి నాగు పాముకు కూడా భయపడదు. సరికదా నాగుపాము ఈ చిన్న జీవిని చూస్తే చాలు తిరిగి పాము కూడా పారిపోతుంది. మరి నాగుపాముని భయపెడుతున్న ఈ జీవి గురించి తెలుసుకుందాం..
పాముని చూస్తే చాలు ఎటువంటి పామైనా సరే భయంతో పరిగెడతారు. అది మనుషులేనా, జంతువులైనా సరే పాముని చూస్తే తమ దారిని మార్చుకుంటారు. అడవికి రాజైన సరే, గజరాజైనా సరే పాముని చూస్తే చాలు తమ దారిని మార్చుకుంటాయి. ముఖ్యంగా పాముల్లో తాచు పాము అంటే ఎవరికైనా భయమే.. ఎందుకంటే దీని విషం దీని పెద్ద బలం. ఈ విషానికి భూమి మీద పెద్ద జంతువైన ఏనుగు కూడా భయపడాల్సిందే. అయితే భూమిపై ఓ చిన్న జీవి ఏ విషపు జంతువైనా చివరికి నాగు పాముకు కూడా భయపడదు. సరికదా నాగుపాము ఈ చిన్న జీవిని చూస్తే చాలు తిరిగి పాము కూడా పారిపోతుంది. మరి నాగుపాముని భయపెడుతున్న ఈ జీవి గురించి తెలుసుకుందాం..
అయితే పాముని భయపెట్టేది ముంగిస అని అనుకుంటే తప్పు.. ఆ చిన్న జీవి
ఇక్కడ మనం ముంగిస గురించి మాట్లాడుతున్నామని మీరు అనుకుంటే, మీరు తప్పుగా భావించారు. ఆ చిన్న జంతువు పేరు మీర్కట్. దక్షిణాఫ్రికాలోని కలహరి ఎడారిలో ఈ మీర్కట్స్ కనిపిస్తాయి. ఈ జీవి ముంగిస జాతికి చెందిన జంతువు. ఈ జీవిని చూసి నాగుపాము కూడా భయపడుతుంది. గుంపులు నివసించే ఈ మీర్కట్స్ సర్వభక్షకులు. జీవన విధానానికి వస్తే.. ఏవి దొరికితే వాటిని తిని కడుపు నింపుకుంటాయి. నాగుపామును కూడా చంపుతాయి.
మీర్కట్స్ పై ప్రభావం చూపని విషం..
మీర్కట్స్ కేవలం ఒక అడుగు ఎత్తు, కిలో కంటే తక్కువ బరువు ఉంటాయి. ఈ జంతువు.. తేళ్లు, పాములను, పాము గుడ్లను తింటాయి. తాము ఆహారం తినే సమయంలో ఎవరైనా అడ్డుకుంటే వాటిని కూడా తిని కడుపు నింపుకుంటాయి. విషం ఈ జీవిపై ఎటువంటి ప్రభావం చూపదు.
అంతేకాదు మీర్కట్స్ మరొక ప్రత్యేక విషయం ఏమిటంటే ఆడ మీర్కట్స్ తన పిల్లలకు మనుషులలా నిలబడి ఆహారాన్ని అందిస్తుంది. ఈ పిల్లలు ఘనమైన ఆహారం జీర్ణం అయ్యే వరకు తల్లితో పాటు బొరియలో ఉంటాయి. 13 సంవత్సరాలు జీవించే జీవి ప్రపంచంలోని దాదాపు ప్రతి జూలో కనిపిస్తుంది. మీర్కట్స్ జీవనం విధానం .. అలవాట్లలో చాలా వరకు మనుషులు వలెనే ఉంటాయి.