బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ హరద్వార్ దూబే (73) సోమవారం (జూన్ 26) తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా గత కొంతకాలంగా ఢిల్లీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా..
ఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ హరద్వార్ దూబే (73) సోమవారం (జూన్ 26) తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా గత కొంతకాలంగా ఢిల్లీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆరోగ్యం విషమించి కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ప్రన్షు దూబే మీడియకు వెల్లడించారు. దుబే పార్థీవాదేహాన్ని ఈరోజు మధ్యాహ్నం ఆయన స్వస్థలం ఆగ్రాకు తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. మృతి పట్ల బీజేపీ నేతలు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రాష్ట్ర మాజీ మంత్రి దూబే ఆగ్రా రాజకీయాల్లో కీలక పదవులు అధిరోహించారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. దూబే 2020లో రాజ్యసభ సభ్యుడు అయ్యారు. కళ్యాణ్ సింగ్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా కూడా దూబే పనిచేశారు. కాగా దూబేకి కుమారుడు ప్రన్షు దూబే, కోడలు ఊర్వశి, కుమార్తె డాక్టర్ కృత్యా దూబే ఉన్నారు. ఆయన సోదరుడు గామా దూబే కూడా దేశ రాజకీయాల్లో చురుగ్గా పనిచేస్తున్నారు.