Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరికలపై దూకుడు పెంచింది. గత కొంతకాలంగా ఏ పార్టీలో చేరాలని సంధిగ్దంలో ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ల ఇళ్ళకి స్వయంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు.
Telangana Elections: తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ కోసం కేసీఆర్ వ్యతిరేక శక్తులు ఒక్కతాటి పైకి రావాలని గత కొంత కాలంగా అనుచరులతో సంప్రదింపులు జరుపుతూ సభలు సమావేశాలు నిర్వహిస్తున్న పొంగులేటి, జూపల్లి పార్టీలో చేరిక ఓ కొలిక్కి వచ్చింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు స్వయంగా వారి ఇళ్లలోకి వెళ్లి కాంగ్రెస్లో చేరాలని ఆహ్వానించడంతో కొద్ది రోజులుగా స్థబ్దుగా ఉన్న చేరికల అంశం ఓ మెట్టు ముందుకు కదిలింది. త్వరలోనే ఈ నేతలంతా హస్తంతో చేయి కలిపేందుకు సిద్ధమవుతున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరికలపై దూకుడు పెంచింది. గత కొంతకాలంగా ఏ పార్టీలో చేరాలని సంధిగ్దంలో ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ల ఇళ్ళకి స్వయంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. ముందుగా పార్టీలో తమంతా ఐక్యంగా ఉన్నామని చెప్పుకోవడానికి ఎంపీ కోమటిరెడ్డి ఇంటికి వెళ్లిన రేవంత్ ఆయనతో కలిసి జూపల్లి నివాసానికి వెళ్లారు. అక్కడే లంచ్ సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్టీలో చేరికలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న తాజా పరిస్థితి తదితర అంశాల పై చర్చించారు. రేవంత్ వెంట మాజీ మంత్రి చిన్నారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మల్లు రవి, ఫిరోజ్ ఖాన్, చామల కిరణ్ లాంటి ముఖ్య నాయకులు వెళ్లారు. అనంతరం జూపల్లి నివాసం నుంచి కాంగ్రెస్ నేతలంతా జూబ్లీహిల్స్ లోని పొంగులేటి నివాసానికి చేరుకున్నారు. అప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా లోని వివిధ నియోజకవర్గాల నుంచి నేతలు పెద్ద ఎత్తున అక్కడి చేరుకున్నారు. దాదాపు రెండు గంటల పాటు కాంగ్రెస్ నేతలు పొంగులేటి, వారి అనుచరులతో చర్చించారు. తెలంగాణలో రాజకీయ పునారేకీకరణకు ఏకమవుదామని కాంగ్రెస్లోకి రావాల్సిందిగా ఆహ్వానించారు.
కేసీఆర్ను ఎలా గద్దె దించాలనే విషయంలో అందరం కలిసి చర్చించుకున్నామని రేవంత్ తెలిపారు. త్వరలోనే ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీని త్వరలోనే కలిసి అన్ని రాజకీయ పరిణామాలు వివరిస్తామని రేవంత్ తెలిపారు. కేసీఆర్ పతనానికి పొంగులేటి పునాధులు వేస్తున్నారని కాంగ్రెస్లో చేరడానికి పొంగులేటి సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 70 -80 స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుందని ఎంపీ కోమటిరెడ్డి జోష్యం చెప్పారు. పార్టీ వీడిన వారు తిరిగి సొంత గూటికి రావాలని పార్టీకి మద్దతు తెలపాలని కోమటిరెడ్డి కోరారు.
తమ చేరిక ఢిల్లీలోనో, హైదరాబాద్ లో కాకుండా ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కాంగ్రెస్ లో చేరానున్నట్లు పొంగులేటి తెలిపారు. ఇందుకోసం విధి విధానాల కోసం 25 న సమావేశాన్ని ఏర్పాటు చేసి వెల్లడిస్తామని పొంగులేటి తెలిపారు. తెలంగాణ ప్రజలు స్వరాష్ట్ర కలలు కళగానే మిగిలిపోయిందని మరో నూతన ఒరవడికి పెద్ద ఎత్తున మార్పులు ఉండబోతున్నాయని తెలిపారు. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న మరో ఉద్యమంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని మంత్రి మంత్రి జూపల్లి కోరారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిలకుండా అందరిని ఏకం చేస్తామని వెల్లడించారు.
చేరికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధిష్టానం పొంగులేటి, జూపల్లితో భారీ బహిరంగ సభలతో మరింత ఉత్తేజం నింపుతు బలహీన నియోజకవర్గాలపై ద్రుష్టి సారించాల్సిన అవసరం ఉంది.