PM Modi US Visit: మోడీ.. మోడీ.. భారత్ మాతాకీ జై.. నినాదాలతో అమెరికా మారుమోగుతోంది. అగ్రరాజ్యం అమెరికాలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అడుగడుగునా ఘనస్వాగతం లభిస్తోంది.
PM Modi US Visit: మోడీ.. మోడీ.. భారత్ మాతాకీ జై.. నినాదాలతో అమెరికా మారుమోగుతోంది. అగ్రరాజ్యం అమెరికాలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అడుగడుగునా ఘనస్వాగతం లభిస్తోంది. బుధవారం వాషింగ్టన్లో అడుగుపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీకి త్రివర్ణ పతాకాలతో ప్రవాస భారతీయులు అపూర్వ స్వాగతం పలికారు. జాయింట్ బేస్ ఆండ్రూస్‌కు చేరుకున్న తర్వాత ప్రధాన మంత్రి విల్లార్డ్ ఇంటర్కాంటినెంటల్ హోటల్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో వాషింగ్టన్‌లోని ఫ్రీడమ్ ప్లాజాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రవాస భారతీయులు మోడీకి ఘన స్వాగతం పలికారు.
మోడీని చూసిన ఆనందంలో.. జాతీయ జెండాలను రెపరెపలాడిస్తూ.. మోడీ, మోడీ, భారత్ మాతాకీ జై, వందేమాతరం అనే నినాదాలతో హోరెత్తించారు. ప్రధాని మోడీ వాషింగ్టన్ రాకను పురస్కరించుకుని ప్రధానమంత్రి స్వస్థలం గుజరాత్ కు చెందిన సంప్రదాయ నృత్యం ‘గర్బా’, ఇతర జానపద నృత్యాలు, పలు సహా సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు.
ఇలా ప్రధాని మోడీ బస చేయనున్న హోటల్ వెలుపల ప్రవాస భారతీయులంతా సందడి చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రవాస భారతీయుల దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. పిల్లలు, ఇతర ప్రవాసులతో మాట్లాడటంతోపాటు.. ఆటోగ్రాఫ్‌లు సైతం ఇచ్చారు.
కాగా.. మోడీ రాక సందర్భంగా కూచిపూడి నృత్యకారిణి కవిత ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన మేము చాలా సంతోషంగా ఉన్నాము.. ఇది మరపురాని సంఘటన. మేము చాలా ఉత్సాహంగా మోడీ రాక కోసం ఎదురు చూస్తున్నాము” అని కవిత తెలిపారు.