జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ కార్పొరేటర్లతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ చేస్తున్న కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అయితే ఈ నెల 16 న జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయం ప్రారంభించనున్న సంగతి తెలిసిందే.
జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ కార్పొరేటర్లతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ చేస్తున్న కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అయితే ఈ నెల 16 న జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయం ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యాలయంతో రాష్ట్ర రాజధానిలో పాలన మరింత బలోపేతమవుతుంది తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణ స్పూర్తితోనే వార్టు కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో కార్పొరేటర్లకు కొన్ని కీలక సూచనలు చేశారు. వార్డు కార్యాలయ వ్యవస్థను కార్పొరేటర్లు విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్పొరేటర్లు ఆయా వార్డుల్లో పార్టీ శ్రేణుల్ని ఎన్నికల కోసం సిద్ధం చేయీలని సూచించారు. ఏడాది పాటు పార్టీ కార్యకలాపాలను విస్తృతం చేయాలని దిశా నిర్దేశం చేశారు.