ఆచార్య చాణక్యుడు తన విధానాలలో మానవ జీవన విధానం గురించి అనేక అంశాలను నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. ప్రతి మనిషి జీవితంలో ప్రతికూల పరిస్థితులు తప్పనిసరి.. అయితే అటువంటి పరిస్థితుల నుండి సులభంగా పరిష్కరించడానికి లేదా బయటపడటానికి అనేక విధానాలు ఉన్నాయని చెప్పాడు.. వాటిని తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. క్లిష్ట పరిస్థితులను అధిగమించడానికి .. వివిధ అంశాలను విశ్లేషించడానికి చాణక్యుడు చాలా విషయాలు చెప్పాడు. వీటిలో కొన్ని చర్యల గురించి తెలుసుకుందాం.
వైఫల్యం నుండి నేర్చుకోండి: ఏదైనా పనిని ప్రారంభించిన తర్వాత ఆ ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇవ్వకపోతే.. నిరాస చెందకండి. ఆ వైఫల్యాలను పాఠాలుగా తీసుకుని విజయానికి బాట వేసుకోండి. ఎప్పుడు ఎక్కడ తప్పు జరిగిందో విశ్లేషించుకోండి.. అభివృద్ధి ఎక్కడ జరుగుతుందో ఆ ప్రాంతాలను గుర్తించండి, అవసరమైన సర్దుబాట్లు చేయమని చెప్పాడు. అపజయం నుంచి విలువైన పాఠాలు నేర్చుకుంటే అపజయం విజయానికి సోపానం అవుతుంది.