అమూల్ గర్ల్ ‘అట్టర్లీ బటర్లీ’ సృష్టికర్త సిల్వెస్టర్ డకున్హా (80) ఇకలేరు. అనారోగ్యం కారణంగా ఆయన మంగళవారం (జూన్ 20) ముంబాయిలో కన్నుమూశారు. సిల్వెస్టర్ డకున్హా మృతిపట్ల ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా..
ముంబాయి: అమూల్ గర్ల్ ‘అట్టర్లీ బటర్లీ’ సృష్టికర్త సిల్వెస్టర్ డకున్హా (80) ఇకలేరు. అనారోగ్యం కారణంగా ఆయన మంగళవారం (జూన్ 20) ముంబాయిలో కన్నుమూశారు. సిల్వెస్టర్ డకున్హా మృతిపట్ల ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఐకానిక్ అమూల్ గార్ల్ ‘అట్టర్లీ బట్టర్లీ’ దాదాపు 3 దశాబ్దాలుగా ఆయన బ్రాండ్ కమ్యూనికేషన్, అడ్వర్టైజింగ్ ఆర్ట్‌ను అమూల్ వినియోగిస్తోంది. అమూల్ గర్ల్ 1966లో తొలిసారి ఆయన చేతుల్లో రూపొందింది. నాటి నుంచి దాని అడ్వర్టైజింగ్ ఏజెన్సీ, ఆర్ట్ డైరెక్టర్, మేనేజింగ్ డైరెక్టర్‌గా సిల్వెస్టర్ డకున్హా కొనసాగుతున్నారు. ప్రచార ప్రకటనలో అమూల్ గర్ల్ మస్కట్ ఎంత విజయం సాధించిందంటే ఏకంగా ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. దశాబ్ధాలుగా ప్రతి వార్తను ఆయన అమూల్ గర్ల్ మస్కట్‌ను కార్టూన్‌గా మలిచారు. మిలియన్ల ప్రజల అభిమానాన్ని చవిచూసిన ఈ మస్కట్ 2016లో సిల్వర్ జూబ్లీని జరుపుకుంది.
డాకున్హా యాడ్ ఏజెన్సీకి చెందిన ఆర్ట్ డైరెక్టర్ యూస్టేస్ ఫెర్నాండెజ్ 1966లో ‘ది అమూల్ గర్ల్’గా ప్రసిద్ధి చెందిన అమూల్ బటర్ గర్ల్‌ని రూపొందించారు. ఈ ప్రకటన మిలియన్ల మంది హృదయాలను గెలుచుకుంది. 2016లో సిల్వర్ జూబ్లీ (స్వర్ణోత్సవం) సందర్భంగా విస్తృతంగా గుర్తింపు లభించింది. 1966తో వ్యాపార ప్రకటనలో మోకాల్లపై ప్రార్థన చేస్తూ.. ఓ కన్నుమూసి, మరో కన్ను తెరచి ఉన్న అమూల్ బేబీ ఇమేజ్ తొలిసారి ప్యాకెట్‌పై ప్రకటించారు. ఈ ఇమేజ్ ముంబాయి వీధుల్లో ప్రదర్శనకు పెట్టారు. వినియోగదారుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ వ్యాపార ప్రకటనలో ఉపయోగించిన ‘అట్టర్లీ బటర్లీ’ అనే పదబంధం కూడా అమూల్ దశాబ్దాలుగా వినియోగిస్తోంది. హాస్యాన్ని కలగలిపి రూపొందించిన అమూల్ బేబీ మస్కట్ ఏళ్లు గడుస్తోన్నా తరగని పాపులారిటీ దక్కించుకుంది.