Barbecue restaurant explosion: సెలవులు కావడంతో వారంతా రెస్టారెండ్ కు వెళ్లారు. ఇంతలోనే ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రెస్టారెంట్లో గ్యాస్ లీక్ కావడంతో 31 మంది దుర్మరణం చెందారు. ఈ ఘోర ప్రమాదం చైనా దేశంలోని చైనా యించువాన్ నగరంలో జరిగింది.
Barbecue restaurant explosion: సెలవులు కావడంతో వారంతా రెస్టారెండ్ కు వెళ్లారు. ఇంతలోనే ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రెస్టారెంట్లో గ్యాస్ లీక్ కావడంతో 31 మంది దుర్మరణం చెందారు. ఈ ఘోర ప్రమాదం చైనా దేశంలోని చైనా యించువాన్ నగరంలో జరిగింది. బుధవారం రాత్రి ఫ్యూయాంగ్ బార్బెక్యూ రెస్టారెంట్లో గ్యాస్ లీకై పేలుడు సంభవించడంతో 31 మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు, మీడియా తెలిపింది. చైనా మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. చైనాలో డ్రాగన్ బోట్ ఫెస్టివల్ సందర్భంగా మూడు రోజులు సెలవులు కావడంతో ప్రజలంతా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో యించువాన్ నగరంలోని ఫ్యూయాంగ్ బార్బెక్యూ రెస్టారెంట్లో బుధవారం రాత్రి 8.40 నిమిషాలకు భారీ పేలుడు సంభవించింది. ఎల్పీజీ గ్యాస్ లీక్ కావడంతో పేలుడు సంభవించి.. భారీ అగ్ని ప్రమాదం జరిగిందని.. వెంటనే పదుల సంఖ్యలో ఫైరింజన్లు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదంలో దాదాపు 31 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో ఏడుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డట్లు అక్కడి అధికారులు తెలిపారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ఏజెన్సీ తెలిపింది. వాయువ్య చైనాలోని డౌన్టౌన్ యిన్చువాన్లోని నివాస ప్రాంతం ఫుయాంగ్ బార్బెక్యూ రెస్టారెంట్లో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.