బెంగళూరు(Bangalore) నగర వ్యాప్తంగా మంగళవారం ఉదయం వాన కుదిపేసింది. తుఫాన్ ప్రభావంతో నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): బెంగళూరు(Bangalore) నగర వ్యాప్తంగా మంగళవారం ఉదయం వాన కుదిపేసింది. తుఫాన్ ప్రభావంతో నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన వాన దాదాపు గంటన్నరపాటు మెజస్టిక్, విజయనగర, చామరాజపేట, హనుమంతనగర్, మేఖ్రీ సర్కిల్, హెబ్బాళ్, యలహంక, శివానంద సర్కిల్, శాంతినగర్, బన్నేరుఘట్ట రోడ్డు, జయనగర్తోపాటు దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ వర్షం ప్రభావం కనిపించింది. ఉదయం పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. కార్యాలయాలకు వెళ్లేవారు తంటాలుపడాల్సి వచ్చింది. నగర వ్యాప్తంగా వర్షం కురవడంతో ట్రాఫిక్ స్తంభించింది. దాదాపు రెండుగంటలపాటు బళ్లారి రోడ్డు, బన్నేరుఘట్టరోడ్డు, ఎలకా్ట్రనిక్ సిటీ ప్రాంతాలలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చిక్కబళ్ళాపుర, తుమకూరు, రామనగర, మండ్య, హాసన్, చామరాజనగర జిల్లాల్లోనూ వర్షం కురిసింది. మరో రెండు రోజులు వర్షప్రభావం ఉంటుందని వాతావరణ పరిశోధనశాఖ ప్రకటించింది.