మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న ‘గుంటూరు కారం’ మళ్ళీ మొదటి నుండి షూటింగ్ చేస్తారని తెలిసింది. ఇంకో కథానాయిక పేరుని కూడా ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తారని అంటున్నారు. నిర్మాతకి సుమారు పది కోట్లకి పైనే నష్టం వచ్చి ఉంటుందని అని కూడా అంటున్నారు. విడుదల తేదీలో కూడా మార్పు ఉండొచ్చు అని కూడా తెలిసింది.
ఏ ముహూర్తాన మొదలెట్టారో కానీ, మొదటి నుండీ ‘గుంటూరు కారం’ #GunturKaram సినిమాకి అవరోధాలే. మహేష్ బాబు (MaheshBabu), త్రివిక్రమ్ శ్రీనివాస్ (TrivkkramSrinivas) కాంబినేషన్ లో గత సంవత్సరం మొదలెట్టిన ఈ సినిమా షూటింగ్ ఇంతవరకు కనీసం పది శాతం మాత్రమే అయిందని అంటున్నారు. ఇప్పుడు పూజ హెగ్డే (PoojaHegde) ఈ చిత్రం నుంచి తప్పుకోవడంతో శ్రీలీల (Sreeleela) ని మెయిన్ కథానాయికగా చేశారు. అలాగే ఇప్పుడు ఇంకో కథానాయిక కోసం చూస్తున్నారని, అది ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తారని అంటున్నారు.
ఇదిలా ఉంటే, సంగీత దర్శకుడు థమన్ (SSThaman) కూడా ఈ సినిమా నుండి తప్పుకున్నాడు అన్న వార్త కొన్ని రోజుల నుండి వైరల్ అవుతోంది. అయితే ఈ ‘గుంటూరు కారం’ #GunturKaram ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా మొదటి నుండీ మొదలెడతారు అని అంటున్నారు. ఎందుకంటే శ్రీలీలని ఇప్పుడు మెయిన్ కథానాయికగా చేసారు కాబట్టి మహేష్ బాబు మరదలుగా అనుకున్నప్పుడు తీసిన సన్నివేశాలు సరిపోవు అని అంటున్నారు. అలాగే మొదట ఒక పోరాట సన్నివేశంతో కదా ఈ సినిమా షూటింగ్ మొదలెట్టారు, అది మహేష్ కి నచ్చలేదు అని తెలిసింది. ఇప్పుడు అది కూడా మళ్ళీ తీస్తున్నారు అని తెలిసింది.
అందుకని ఈ సినిమా ఇప్పుడు మళ్ళీ మొదటి నుండి షూటింగ్ మొదలెట్టాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. మరి ఇంతవరకు తీసింది ఏమి చేస్తారు అంటే, ఏమీ చెయ్యరట అదంతా వేస్ట్ అని అంటున్నారు. అంటే నిర్మాతకి సుమారు ఒక పదికోట్ల వరకు నష్టం వాటిల్లి ఉంటుంది ఈ సినిమా వలన ఇప్పటికే అని కూడా అంటున్నారు.
షూటింగ్ అయిన పార్టు అంతా ఇప్పుడు పక్కన పడేసి ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తే ఈ సినిమా వచ్చే జనవరి కి అయితే రావటం కష్టం అని అంటున్నారు పరిశ్రమలో. అందుకని ఈ సినిమా వచ్చే సంవత్సరం వేసవిలో విడుదల చేయొచ్చు అని కూడా అంటున్నారు. మహేష్ బాబు, శ్రీలీల తో పాటు ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ (PrakashRaj), రమ్యకృష్ణ (RamyaKrishna), జగపతి బాబు (JagapathiBabu), జయరాం (Jayaram), మురళి శర్మ (MuraliSharma), రావు రమేష్ (RaoRamesh), రఘుబాబు, బ్రహ్మాజీ, రోహిణి ఇంకా చాలామంది ఆర్టిస్టులు వున్నారని తెలిసింది.