Custard apple: సీతాఫలాన్ని వీరు అస్సలు తినొద్దు.. ఆరోగ్య నిపుణులు చెబుతున్న కీలక వివరాలు..డయాబెటిక్ రోగులు కార్బోహైడ్రేట్స్ అధికంగా తీసుకోవద్దు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుంది. కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉన్న ఫలాలలో సీతాఫలం ఒకటి. ఇందులో సహజ చక్కెరలు ఉంటాయి. అందుకే దీనిని తినే ముందు మధుమేహ బాధితులు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి.డయాబెటిక్ రోగులు కార్బోహైడ్రేట్స్ అధికంగా తీసుకోవద్దు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుంది. కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉన్న ఫలాలలో సీతాఫలం ఒకటి. ఇందులో సహజ చక్కెరలు ఉంటాయి. అందుకే దీనిని తినే ముందు మధుమేహ బాధితులు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. వీలైనంత వరకు తక్కువగా తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.మధుమేహ బాధితులు సీతాఫలం తినే ముందు ఈ చిట్కాలు పాటించాలి..
- సీతాఫలాన్ని ఖాళీ కడుపుతో కాకుండా భోజనంలో భాగంగా తీసుకోవడం చాలా మంచిది. ఇలా తినడం వలన రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది.
- కూరగాయలు, లీన్ ప్రోటీన్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి తక్కువ గ్లైసెమిక్ ఆహారాలతో సీతాఫలాన్ని తినడం మంచిది. ఇది జీర్ణక్రియ, చక్కెర శోషణను నెమ్మదిస్తుంది.ఈ విషయాల్లో జాగ్రత్త..
- సీతాఫలం తింటే కొంతమందికి అలెర్జీలు వస్తాయి. అలెర్జీ, ఏదైనా ప్రతికూల పరిస్థితి ఉంటే.. సీతాఫలాలను తినకుండా ఉండటమే ఉత్తమం.
- ఏదైనా ఆహారం అధికంగా తింటే.. దాని ప్రభావం ఆరోగ్యంపై పడుతుంది. అలాగే సీతాఫలం కూడా అధికంగా తింటే మధుమేహుల్లో షుగర్ లెవల్స్ మరింత పెరిగే ప్రమాదం ఉంది.