బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) బుధవారం ఢిల్లీ వెళ్తున్నారు. ఆయన ఒక్కరే ఢిల్లీలో పలువురు కాంగ్రెస్ ముఖ్యనేతలను కలవనున్నారు. ముందస్తుగా ప్రకటించిన విధంగా మంత్రులతో కాంగ్రెస్ అగ్రనేతల భేటీ రద్దయింది. పలువురు కేంద్రమంత్రులతోనూ భేటీ కానున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటనకు వెళ్లిన కారణంగా కలిసే అవకాశం లేదు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి కృష్ణభైరేగౌడ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన జీఎస్టీ సహా పలు గ్రాంట్ల విడుదల విషయమై చర్చించారు.