మునిగిపోయిన టైటానిక్ సందర్శనకు వెళ్లిన జలాంతర్గామి అదృశ్యం.. పర్యాటకుల్లో ఓ బిలియనీర్ కూడా..అట్లాంటిక్‌లో సుమారు 400 మైళ్ళు (640 కిమీ) ప్రయాణించి టైటానిక్ శిథిలాల ప్రదేశానికి చేరుకుంటుంది. టైటానిక్ శిథిలాలను సందర్శించడానికి ప్రయాణీకులు నౌకలో ఎక్కారు.ఇది టైటానిక్ వద్ద దిగడానికి రెండు గంటల సమయం పడుతుంది. కానీ, అంతలోనే టూరిస్ట్‌లతో వెళ్లిన జలాంతర్గామి అదృశ్యం తీవ్ర సంచలనంగా మారింది.విధి వెంటాడింది అంటే ఇదేనేమో..! టైటానిక్ మునిగిపోయి 110 సంవత్సరాలకు పైగా గడిచింది. కానీ, దాని ప్రస్థానం ఇంకా కొనసాగుతూనే ఉంది. నీట మునిగిన టైటానిక్ శిథిలాలను చూసేందుకు వెళ్లిన జలాంతర్గామి అదృశ్యమైంది. లోపల ఉన్నవారిలో కొన్ని గంటలపాటు సరిపడా ఆక్సిజన్ మాత్రమే ఉండడంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. టైటానిక్ శిథిలాలను చూసేందుకు పర్యాటకులను తీసుకెళ్లేందుకు ఉపయోగించే జలాంతర్గామి అకస్మాత్తుగా అదృశ్యమైంది. ఆగ్నేయ కెనడా తీరంలో టైటానిక్ శిథిలాలను అన్వేషించడానికి పర్యాటక యాత్రలో ఉన్న జలాంతర్గామి కనిపించకుండా పోయిందని ఓడను నిర్వహిస్తున్న ప్రైవేట్ సంస్థ తెలిపింది.ఓషన్‌గేట్ ఎక్స్‌పెడిషన్స్ జూన్ 19న ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. మిస్సైన ఓడలో ఉన్నవారిని రక్షించడానికి ముమ్మర సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆ ప్రైవేటు సంస్థ తెలిపింది. ఇకపోతే, ఆ నౌకలో ఎంత మంది గల్లంతయ్యారనే దానిపై స్పష్టత రాలేదు. అదృశ్యమైన ఓడ కోసం, కెనడియన్, బోస్టన్ కోస్ట్ గార్డ్ల సహాయంతో గాలింపు చేపట్టారు. కోస్ట్ గార్డ్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. కానీ, అదృశ్యమైనప్పుడు అందులో ఎంతమంది ఉన్నారో తెలియరాలేదని, OceanGate వెబ్సైట్ ప్రకారం, టైటాన్ జలాంతర్గామిలో ఉన్నవారు 96 గంటలు మాత్రమే జీవించగలరనే సమాచారం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. అయితే, సముద్రంలో గల్లంతైన జలాంతర్గామిలో ఓ బిలియనీర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బ్రిటన్ బిలియనీర్ హమీష్ హార్డింగ్ (58) ఉన్నట్లు సమాచారం. ఈ హమీష్ హార్డింగ్.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ – యూఏఈలో నివసిస్తున్నాడు. జలాంతర్గామిలో ఐదుగురు ఉన్నారని, అందులో హమీష్ హార్డింగ్, సాహస యాత్రలపై ఆసక్తితోనే వెళ్లారని రియర్ అడ్మిరల్ జాన్ ముగర్ వెల్లడించారు.
1912 ఏప్రిల్ 14 అర్ధరాత్రి టైటానిక్ అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 1500 మంది మరణించారు. ప్రమాదం తర్వాత, కెనడాకు 650 కిలోమీటర్ల దూరంలో 3,843 మీటర్ల లోతులో ఓడ రెండు ముక్కలైంది. ఈ రెండు భాగాలు ఒకదానికొకటి 800 మీటర్ల దూరంలో కనిపించాయి. ఇక అప్పటి నుంచి అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్ శిధిలాల కోసం నిరంతర అన్వేషణ కొనసాగింది. ఈ క్రమంలోనే అది అక్కడి హిమానీనదాల్లోకి కూలిపోయిందని గుర్తించారు.ఓషన్‌గేట్ ఎక్స్‌పెడిషన్స్ జూన్ 19న ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. మిస్సైన ఓడలో ఉన్నవారిని రక్షించడానికి ముమ్మర సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆ ప్రైవేటు సంస్థ తెలిపింది. ఇకపోతే, ఆ నౌకలో ఎంత మంది గల్లంతయ్యారనే దానిపై స్పష్టత రాలేదు. అదృశ్యమైన ఓడ కోసం, కెనడియన్, బోస్టన్ కోస్ట్ గార్డ్ల సహాయంతో గాలింపు చేపట్టారు. కోస్ట్ గార్డ్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. కానీ, అదృశ్యమైనప్పుడు అందులో ఎంతమంది ఉన్నారో తెలియరాలేదని, OceanGate వెబ్సైట్ ప్రకారం, టైటాన్ జలాంతర్గామిలో ఉన్నవారు 96 గంటలు మాత్రమే జీవించగలరనే సమాచారం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. అయితే, సముద్రంలో గల్లంతైన జలాంతర్గామిలో ఓ బిలియనీర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బ్రిటన్ బిలియనీర్ హమీష్ హార్డింగ్ (58) ఉన్నట్లు సమాచారం. ఈ హమీష్ హార్డింగ్.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ – యూఏఈలో నివసిస్తున్నాడు. జలాంతర్గామిలో ఐదుగురు ఉన్నారని, అందులో హమీష్ హార్డింగ్, సాహస యాత్రలపై ఆసక్తితోనే వెళ్లారని రియర్ అడ్మిరల్ జాన్ ముగర్ వెల్లడించారు.
కంపెనీ ప్రస్తుతం 2023 ఐదవ టైటానిక్ “మిషన్”ని నిర్వహిస్తోంది. OceanGate వెబ్సైట్ ప్రకారం ఇందులో ప్రయాణించాలంటే.. ఒక వ్యక్తికి $250,000 (భారత కరెన్సీ ప్రకారం రూ.2,05,28,875.00) ఖర్చవుతుంది. ఈ యాత్ర న్యూఫౌండ్‌ల్యాండ్‌లోని సెయింట్ జాన్స్‌లో ప్రారంభమవుతుంది. అట్లాంటిక్‌లో సుమారు 400 మైళ్ళు (640 కిమీ) ప్రయాణించి టైటానిక్ శిథిలాల ప్రదేశానికి చేరుకుంటుంది. టైటానిక్ శిథిలాలను సందర్శించడానికి ప్రయాణీకులు నౌకలో ఎక్కారు.ఇది టైటానిక్ వద్ద దిగడానికి రెండు గంటల సమయం పడుతుంది. కానీ, అంతలోనే టూరిస్ట్‌లతో వెళ్లిన జలాంతర్గామి అదృశ్యం తీవ్ర సంచలనంగా మారింది.