Ram Charan and Upasana: అపోలో ఆస్పత్రి దగ్గర సందడి వాతావరణం.. ఫ్యాన్స్ కోసం ఆస్పత్రి దగ్గర స్పెషల్ గ్యాలరీమా చరణ్‌కి కూతురు పుట్టిందని మెగా ఫ్యామిలీ, మా ఉపాసన అమ్మ అయిందని కామినేని కుటుంబం సంబరాలు చేసుకుంటున్నారు. ఈ శుభవార్తను చెర్రీ దంపతులు ఎప్పుడెప్పుడు చెబుతారా అని మెగా అభిమానులు పదేళ్లుగా ఈగర్‌గా వెయిట్ చేశారు. ఎన్నోసార్లు మీడియా సమక్షంలో మెగా కాంపౌండ్‌కి ఈ ప్రశ్నలు ఎదురయ్యాయి.మేం తల్లిదండ్రులం అయ్యామోచ్.. అంటూ ఆనందంగా ఉన్నారు రామ్‌చరణ్ అండ్ ఉపాసన. మా చరణ్‌కి కూతురు పుట్టిందని మెగా ఫ్యామిలీ, మా ఉపాసన అమ్మ అయిందని కామినేని కుటుంబం సంబరాలు చేసుకుంటున్నారు. ఈ శుభవార్తను చెర్రీ దంపతులు ఎప్పుడెప్పుడు చెబుతారా అని మెగా అభిమానులు పదేళ్లుగా ఈగర్‌గా వెయిట్ చేశారు. ఎన్నోసార్లు మీడియా సమక్షంలో మెగా కాంపౌండ్‌కి ఈ ప్రశ్నలు ఎదురయ్యాయి. అలాంటి ప్రశ్నల మధ్య గతేడాది డిసెంబర్ 12న ఫస్ట్ గుడ్ న్యూస్ చెప్పింది మెగాస్టార్ కుటుంబం. ఇక రామ్ చరణ్ దంపతులకు జూన్ 20 అంటే నేడు తెల్లవారుజామున ఆడపిల్ల జన్మించింది. దాంతో ఇటు కొణిదెల ఫ్యామీలీ, కామినేని ఫ్యామిలీ ఆనందంలో తేలిపోతున్నాయి.
ఇక చెర్రీ-ఉపాసనకు పుట్టిన పాపను లిటిల్ మెగా ప్రిన్సెస్‌గా అభివర్ణించారు మెగాస్టార్ చిరంజీవి. నీ రాకతో మెగాఫ్యామిలీ అమితానందాన్ని తీసుకొచ్చావ్ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. తల్లిదండ్రులుగా చెర్రీ-ఉపాసన, గ్రాండ్ పేరెంట్స్‌గా మేము గర్వపడుతున్నాం అన్నారు చిరంజీవి. ఇక చరణ్ దంపతులకు విషెస్ చెప్పారు జూ.ఎన్టీఆర్.అపోలో ఆస్పత్రిలో బిడ్డకు జన్మానించారు ఉపాసన. అర్థరాత్రి 2గంటల 7నిమిషాలకు పాపకు జన్మానించారు. తల్లీబిడ్డ క్షేమమంటూ అపోలో డాక్టర్స్ హెల్త్‌బులెటిన్ రిలీజ్ చేశారు. డెలివరీ అయిన వెంటనే ఆస్పత్రికి వచ్చి మనమరాలిని చూసి వెళ్లారు చిరంజీవి. ఇక అపోలో ఆస్పత్రి దగ్గర సందడి వాతావరణం నెలకొంది. మెగా మనమరాలికి గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నారు అభిమానులు. అపోలో ఆస్పత్రి దగ్గర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు..కేక్‌లు, స్వీట్లతో పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. కంగ్రాట్స్ అన్నయ్య వదిన అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక గిఫ్ట్‌లు, బొకేలతో హాస్పటల్ కు చేరుకుంటున్నారు ఫ్యాన్స్. అభిమానుల కోసం ఆస్పత్రి దగ్గర స్పెషల్ గ్యాలరీ ఏర్పాటు చేశారు.