Laundry Hacks: మీ దుస్తులపై ఇంకు, రక్తం, నూనె వంటి మొండి మరకలా.. ఇంట్లోనే సింపుల్ టిప్స్‌తో తొలగించండి ఇలా..మొండి మరకలను దుస్తులపై నుంచి తొలగించడానికి కొంతమంది డబ్బు కూడా ఖర్చు పెడతారు. అయినప్పటికీ తగిన ఫలితం దక్కకపోతే తీవ్ర నిరాశకు గురవుతారు. ఈ నేపథ్యంలో కొన్ని రకాల మొండి మరకలను హెయిర్‌స్ప్రే ,హ్యాండ్ శానిటైజర్, బేకింగ్ సోడా వంటి రకరకాల పదార్ధాలను ఉపయోగించి తొలగించ వచ్చు అని తెలుసా..మనం ధరించే దుస్తులపై ధుమ్ము, ధూళి చేరుకుంటాయి. ఒకొక్కసారి దుస్తులపై ఇంకు, లిప్‌స్టిక్ గుర్తులు, రక్తపు మరకలు, పచ్చళ్ల నూనె, టీ, కాఫీ వంటి మరకలు పడి వాటి అందం కోల్పోయేలా చేస్తాయి. ఇలాంటి మొండి మరకలను దుస్తులపై నుంచి తొలగించడానికి కొంతమంది డబ్బు కూడా ఖర్చు పెడతారు. అయినప్పటికీ తగిన ఫలితం దక్కకపోతే తీవ్ర నిరాశకు గురవుతారు. ఈ నేపథ్యంలో కొన్ని రకాల మొండి మరకలను హెయిర్‌స్ప్రే ,హ్యాండ్ శానిటైజర్, బేకింగ్ సోడా వంటి రకరకాల పదార్ధాలను ఉపయోగించి తొలగించ వచ్చు అని తెలుసా.. ఈ రోజు దుస్తుల మెరుపు తగ్గకుండా మొండి మరకలను ఎలా తొలగించవచ్చునో తెలుసుకుందాం..లిప్ స్టిక్ మరకలు: ఈ మరకలను తొలగించడానికి బెస్ట్ రెమిడీ వైట్ బ్రెడ్. లిప్ స్టిక్ మరకలను తొలగించడానికి బ్రెడ్ ను తీసుకుని చుట్టూ కత్తిరించి మధ్య భాగం తీసుకోండి. దీంతో మరక ఉన్న ప్లేస్ లో కొంచెం సేపు రుద్దండి. తర్వాత సాధారణ బట్టలను అతికినట్లు ఉతకండి. దీంతో ఈ లిప్ స్టిక్ మరక తోలజి.. కొత్త దుస్తుల్లా మెరిసిపోతూ ఉంటాయి.
ఇంకు మరకలు: దుస్తులపై ఉన్న ఇంకు మరకలను హ్యాండ్ శానిటైజర్ తొలగిస్తుంది. మరక పడిన ప్లేస్ లో ఒక టీస్పూన్ హ్యాండ్ శానిటైజర్‌ని చల్లి కొంచెం సేపు అలా వదిలి వేయండి.. తర్వాత మామూలుగా ఆ దుస్తులను ఉతకాలి.రక్తపు మరకలు: హైడ్రోజన్ పెరాక్సైడ్ కు ఒక టీస్పూన్ వాషింగ్ పౌడర్‌తో కలిపి.. తడిగా ఉన్నప్పుడే రక్తపు మరకలపై అప్లై చేయండి. 10 నిమిషాలు వేచి ఉండండి. తర్వాత ఉతకాలి.
గ్రీజు మరకలు: గ్రీజు, ఆయిల్ వంటి మరకలు దుస్తులపై ఉంటే.. ఆ ప్రదేశంలో సుద్ద ముక్కలతో రుద్దండి. ఇలా చేయడం వలన సుద్ద నూనెను పీల్చుకుంటుంది. మీకు సుద్ద అందుబాటులో లేకపోతే, టాల్కమ్ పౌడర్ మ్యాజిక్ లాగా పని చేస్తుంది.
పసుపు చెమట మరకలు: మూడు ఆస్పిరిన్ మాత్రలను చూర్ణం చేసి అర కప్పు వేడి నీటిలో కలపండి చెమట మరకలున్న దుస్తులను మంచి మూడు గంటలు నానబెట్టండి. ఆ తర్వాత ఉతకండి. ఇలా చేయడం వలన మీ దుస్తులు శుభ్రపడతాయి.
రెడ్ వైన్ మరకలు: ఈ మారక తడిగా ఉన్న సమయంలోనే పాలు, క్లబ్ సోడా, టేబుల్ సాల్ట్ సమాన మొత్తంలో తీసుకుని ఈ మిశ్రమం రెడ్ వైన్ మరకలపై (తడిగా ఉన్నప్పుడు) అప్లై చేయాలి. సున్నితంగా రుద్దాలి. తర్వాత ఆ బట్టలను ఉతకాలి.
యాక్రిలిక్ పెయింట్ మరకలు: బట్టలపై పెయింటింగ్ రంగులు పడితే.. కొద్దిగా ఆల్కహాల్ ను ఆ మారకాలపై పదినిమిషాలు రుద్ది.. తర్వాత ఉతకాలి.
దుర్వాసన, చెమటతో కూడిన బట్టలు: చెమట, దుర్వాసనతో ఉన్న బట్టలకు ఆ వాసన పోవాలంటే.. వెనిగర్ బెస్ట్ ఎంపిక. ఒక బకెట్ నీటిలో వెనిగర్ కలిపి బట్టలను ఉతికితే చెడు వాసన తొలగిపోతుంది.
గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసమే.. వీటిని టీవీ 9 ఏ విధంగానూ ధ్రువీకరించడం లేదు.