8.5 కోట్లు దోచుకున్నారు.. రూ.10 కూల్‌డ్రింక్ కోసం కక్కుర్తిపడ్డారు.. చివరికి ఊహించని ట్విస్ట్ఉత్తరఖాండ్లో ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. పంజాబ్‌కు చెందిన ఓ జంట రూ.8.49 కోట్లు దోచుకొని పారిపోతూ.. రూ.10లకు కూల్‌డ్రింక్‌కు కక్కుర్తిపడి పోలీసులకు దొరికిపోవడం సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే పంజాబ్‌లోని లుథియానాలో ఈనెల 10న సీఎంఎస్ సెక్యురిటీస్ అనే సంస్థలో దాదాపు రూ.8.49 కోట్ల దోపిడి జరిగింది.ఉత్తరఖాండ్‌లో ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. పంజాబ్‌కు చెందిన ఓ జంట రూ.8.49 కోట్లు దోచుకొని పారిపోతూ.. రూ.10లకు కూల్‌డ్రింక్‌కు కక్కుర్తిపడి పోలీసులకు దొరికిపోవడం సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే పంజాబ్‌లోని లుథియానాలో ఈనెల 10న సీఎంఎస్ సెక్యురిటీస్ అనే సంస్థలో దాదాపు రూ.8.49 కోట్ల దోపిడి జరిగింది. సంస్థ నిర్వాహకులు పోలీసులను ఆశ్రయించగా.. ఈ దోపిడిలో డాకూ హసీనగా పేరున్న మన్దీప్ కౌర్ అనే మహిళను నిందితురాలిగా గుర్తించారు. అయితే పోలీసుల నుంచి తప్పించుకునేందుకు మన్దీప్ కౌర్ తన భర్త జశ్విందర్ సింగ్‌తో కలిసి పంజాబ్ విడిచి వెళ్లిపోయింది. ఆ దంపతులు నేపాల్‌కు పారిపోయేందుకు ప్లాన్ చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. అయితే అంతకు ముందు ఆ దంపతులు హరీద్వార్, కేథర్నాథ్తో పాటు పలు పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు.ఉత్తరఖాండ్‌లోని హెమ్కుంద్ సాహిబ్ అనే సిక్కుల పుణ్యక్షేత్రానికి వచ్చినట్లు పోలీసులకు తెలిసింది. అక్కడికి చాలా మంది భక్తులు రావడంతో ఆ నిందితులను గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది. దీంతో వారు ఓ పథకం పన్నారు. భక్తుల కోసం ఉచితంగా కూల్‌డ్రింక్‌లు ఇచ్చేలా ఓ స్టాల్ ఏర్పాటు చేశారు. అలా ఆ స్టాల్ వద్దకు భక్తులు వస్తుండగా… చివరికి ఆ దంపతులు కూడా వచ్చారు. కానీ వారు మొహాలు కనిపించకుండా కవర్లు వేసుకున్నారు. అయినప్పటికీ వారు ఆ స్టాల్ వద్ద తమ ముసుగులు తీయాల్సి వచ్చింది. పోలీసులు వారిని గుర్తించినప్పటికి వెంటనే పట్టుకోలేదు. హేమ్‌కుండ్ సాహెబ్‌లో ఆ దంపతులు ప్రార్థనలు చేసిన అనంతరం అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం మన్దీప్ కౌర్ ద్విచక్రవాహనం నుంచి రూ.12 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే తన భర్త జశ్విందర్ సింగ్ ఇంటి నుంచి రూ.9 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మొత్తం 12 మంది నిందితులుండగా పోలీసులు ఆ దంపతులతో సహా 9 మందిని అరెస్టు చేశారు. మన్దీప్ కౌర్ ధనవంతురాలిగా మారాలని అనుకుందని.. గతంలో ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా కూడా పనిచేసిందని విచారణలో తెలిసింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం పనిచేస్తున్న సీఎంఎస్ అనే క్యాష్ మేనేజ్మెంట్ సేవలు అందించే సంస్థలో ఐదుగురు ఉద్యోగుల్ని బందీలుగా చేసుకుందని.. ఆ తర్వాత వారి సహాకారంతో ఈ దోపిడి చేసిందని గుర్తించారు.